ETV Bharat / sports

IPL 2023: ఐపీఎల్​లో రోహిత్ చెత్త రికార్డు.. అదేంటో తెలుసా?

ఐపీఎల్​లో రోహిత్ శర్మ పేరిట ఓ చెత్త రికార్డు ఉంది. లీగ్ చరిత్రలో డెక్కన్ ఛార్జర్స్, ముంబయి ఇండియన్స్ తరఫున ఆడిన రోహిత్.. ఎన్నో గొప్ప రికార్డులతోపాటు ఈ చెత్త రికార్డునూ సొంతం చేసుకున్నాడు. అదేంటంటే?

rohit
rohit
author img

By

Published : Mar 25, 2023, 1:30 PM IST

యావత్​ క్రికెట్​ అభిమానులు ఎంతో మెచ్చే ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ 16వ సీజన్​ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఐపీఎల్ వస్తుందంటే చాలు.. రికార్డుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అత్యధిక రన్స్, అత్యధిక సెంచరీలు, ఫాస్టెస్ట్​ సెంచరీలు, అత్యధిక సిక్స్​లు వంటి సూపర్​ రికార్డుల గురించి చాలా మంది తెలుసు. అయితే ఈ మెగా లీగ్​లో ఎక్కువ సార్లు డకౌటైన ప్లేయర్స్ గురించి మీకు తెలుసా? ఇప్పటికే 15 సీజన్లు పూర్తి చేసుకున్న ఐపీఎల్​లో పది కంటే ఎక్కువసార్లు డకౌటైన ప్లేయర్లు చాలా మందే ఉన్నారు.

లీగ్​ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరు సంపాదించిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఉండటం విశేషం. అత్యధిక పరుగులు, సిక్స్​లు, సెంచరీల రికార్డులతోపాటు ఐపీఎల్లో రోహిత్ పేరిట ఈ డకౌట్స్ రికార్డు కూడా ఉంది. 2008లో జరిగిన తొలి సీజన్ నుంచి ఐపీఎల్ ఆడుతున్న రోహిత్.. ఇప్పటి వరకూ 222 ఇన్నింగ్స్ ఆడాడు. అందులో ఏకంగా 14 సార్లు డకౌటయ్యాడు. అత్యధిక డకౌట్స్ లిస్టులో అతడే టాప్​లో ఉన్నాడు.

అంతే కాదు.. ఈ అత్యధిక డకౌట్స్ అయిన ప్లేయర్ల జాబితాలో విదేశీ ప్లేయర్స్ కంటే భారత క్రికెటర్లే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఐపీఎల్​లో అత్యధిక సార్లు డకౌట్ అయిన టాప్ 10 లిస్టులో మొదటి 8 మంది ఇండియన్ బ్యాటర్లే. రోహిత్ తోపాటు రహానే, రాయుడు లాంటి ప్లేయర్స్ ఈ లిస్ట్​లో ఉన్నారు.

  • ఐపీఎల్​లో అత్యధిక డకౌట్స్
  • రోహిత్ శర్మ - 14
  • మణ్‌దీప్ సింగ్ - 14
  • పీయూష్ చావ్లా - 13
  • హర్భజన్ సింగ్ - 13
  • పార్థివ్ పటేల్ - 13
  • అజింక్య రహానే - 13
  • అంబటి రాయుడు - 13
  • దినేశ్​ కార్తీక్ - 13
  • రషీద్ ఖాన్ - 12
  • సునీల్ నరైన్ - 12

మార్చి 31వ తేదీన ఐపీఎల్​ 16వ సీజన్​ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్​లో డిఫెండింగ్​ ఛాంపియన్​ గుజరాత్​ టైటాన్స్, నాలుగు సార్లు టైటిల్​ను గెలుచుకున్న చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టు తలపడనున్నాయి. అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్​ జరగనుంది. అంతకన్నా ముందు పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టేందుకు బీసీసీఐ ప్లాన్​ చేస్తోంది. ఇటీవలే ఆస్కార్​ గెలుచుకున్న నాటు నాటు పాటకు డ్యాన్స్​ ప్రదర్శన ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.