ETV Bharat / sports

IPL 2023: లఖ్​నవూ X సన్​రైజర్స్​.. ఫస్ట్​ బ్యాటింగ్​ ఎవరిదంటే? - ఐపీఎల్ 2023 లఖ్​నవూ మ్యాచ్​

ఐపీఎల్ 2023లో భాగంగా లఖ్​నవూ సూపర్ జెయింట్స్, సన్‌‌రైజర్స్ హైదరాబాద్ జట్లు మధ్య మ్యాచ్​ ప్రారంభమయ్యింది. ఈ మ్యాచ్​లో సన్​రైజర్స్ టాస్​​ గెలుచుకుంది.

lucknow super giants vs sunrisers hyderabad

author img

By

Published : Apr 7, 2023, 7:03 PM IST

Updated : Apr 7, 2023, 7:21 PM IST

ఇండియన్​ ప్రీమియర్ లీగ్​ 2023లో భాగంగా లఖ్​నవూ సూపర్ జెయింట్స్, సన్‌‌రైజర్స్ హైదరాబాద్ జట్లు మధ్య మ్యాచ్​ ప్రారంభమయ్యింది. ఈ క్రమంలో సన్​రైజర్స్​ జట్టు టాస్​ గెలిచింది. బ్యాటింగ్​​ ఎంచుకుంది. ప్రత్యర్థి లఖ్​నవూ జట్టుకు బౌలింగ్ అప్పగించింది.

ఈ 16వ సీజన్​లో రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఘోరంగా విఫలమై ఓటమిపాలైంది. ప్రస్తుత మ్యాచ్‌కు సారథి ఐదెన్‌ మార్‌క్రామ్‌ అందుబాటులోకి రావడం హైదరాబాద్‌కు కలిసొస్తుందా చూడాలి. మరోవైపు ఇప్పటివరకు 2 మ్యాచ్‌లు ఆడిన లఖ్‌నవూ జట్టు.. దిల్లీపై గెలిచి, చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో చివరి వరకు పోరాడి ఓడిపోయింది.

సన్‌రైజర్స్‌ జట్టు : అభిషేక్‌ శర్మ, రాహుల్‌ త్రిపాఠి, మయాంక్‌ అగర్వాల్‌, ఐదెన్​ మార్‌క్రామ్‌(కెప్టెన్‌), హ్యారీ బ్రూక్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, ఆదిల్‌ రషీద్‌, వాషింగ్టన్‌ సుందర్‌, భువనేశ్వర్‌ కుమార్​, ఉమ్రాన్‌ మాలిక్‌, టీ నటరాజన్‌, అమోల్​ ప్రీత్​సింగ్​.

లఖ్‌నవూ జట్టు : కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), డికాక్‌, కృనాల్‌ పాండ్య, దీపక్‌ హుడా, మార్కస్​ స్టోయినిస్‌, కైల్‌ మేయర్స్‌, నికోలస్​ పూరన్‌, ఆయుష్​ బదోని, రవి బిష్ణోయ్‌, మార్క్‌ ఉడ్‌, జయదేవ్​ ఉనద్కత్‌, ఆవేశ్‌ ఖాన్‌.

కొత్త కెప్టెన్‌ సారథ్యంలో..
భువనేశ్వర్‌ సారథ్యంలో సన్‌రైజర్స్‌ ఆడిన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌పై అన్ని విభాగాల్లో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. అయితే రెండో మ్యాచ్‌కు అతడి స్థానంలో అసలైన సారథి ఐదెన్‌ మార్‌క్రామ్‌ జట్టులోకి తిరిగి రావడం సానుకూలాంశంగా మారింది. ఇక లఖ్‌నవూను అడ్డుకునేందుకు కొత్త కెప్టెన్‌ ఎలాంటి వ్యూహాలతో వస్తాడో చూడాలి. మరోవైపు తొలి మ్యాచ్‌లో భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో రెండో మ్యాచ్‌లోనైనా విజయం సాధించాలంటే.. టాప్‌ ఆర్డర్‌ రాణించాలి.

డికాక్‌ రాక..
తొలి మ్యాచ్‌లో దిల్లీపై గెలిచిన లఖ్​నవూ టీమ్​ రెండో మ్యాచ్‌లో చెన్నైపై ఓటమిపాలైంది. ఇప్పుడు మూడో మ్యాచ్‌ను సొంత మైదానంలో ఆడుతోంది. అటు క్వింటన్‌ డికాక్‌ కూడా ఈ మ్యాచ్​కు చేరుతుండటం లఖ్‌నవూకు కలిసొచ్చే అంశంగా పరిగణించవచ్చు. ఇక రెండు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కైల్‌ మేయర్స్‌ మైదానంలో అద్భుతంగా రాణిస్తున్నాడు. రెండు అర్దశతకాలతో రాణించాడు. అయితే ఇప్పుడు డికాక్‌ స్థానంలో వచ్చిన అతడిని మూడో మ్యాచ్‌లో కొనసాగిస్తారా లేదా అనేది వేచి చూడాలి. గొప్పగా రాణించని స్టొయినిస్‌ను పక్కన పెట్టి డికాక్‌ను తీసుకొనే అవకాశం లేకపోలేదు.

Last Updated : Apr 7, 2023, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.