ETV Bharat / sports

ఐపీఎల్ చరిత్రలోనే కృనాల్ చెత్త రికార్డ్​.. బ్యాక్ టు బ్యాక్ గోల్డెన్​ డకౌట్లు! - ipl 2023 lsg vs csk

లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ తాత్కాలిక కెప్టెన్ కృనాల్ పాండ్య ఐపీఎల్​లో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఆ రికార్డు ఏంటంటే..

pandya bros
pandya bros
author img

By

Published : May 8, 2023, 11:27 AM IST

Updated : May 8, 2023, 2:48 PM IST

ఐపీఎల్​ సీజన్ 16లో రికార్డుల పరంపర కొనసాగుతోంది. కొందరు ఆటగాళ్లు కెరీర్​లో అత్యుత్తమ రికార్డులు నెలకొల్పుతుంటే.. మరి కొందరు పేలవ ప్రదర్శనతో చెత్త రికార్డులను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో కృనాల్ పాండ్య వచ్చి చేరాడు. రీసెంట్​గా లఖ్​నవూ సూపర్​ జెయింట్స్ జట్టు బాధ్యతలు స్వీకరించిన కృనాల్.. అటు కెప్టెన్​గా ఇటు బ్యాటర్​గా రెండింటిలోనూ విఫలమవుతున్నాడు. చెన్నై సూపర్​ కింగ్స్​ మ్యాచ్​తో ఫుల్ టైం కెప్టెన్​గా పరిచయం అయ్యాడు కృనాల్​.

ఆ మ్యాచ్​లో కెప్టెన్​గా ముందుండి నడిపించాల్సిన కృనాల్ డకౌట్​గా వెనుదిరిగాడు. తర్వాత తన తమ్ముడు హార్దిక్ సారధ్యం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్​తో ఆడిన మ్యాచ్​లోనూ సున్నా చుట్టేశాడు. ఈ క్రమంలో కెప్టెన్​గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆడిన మొదటి రెండు మ్యాచుల్లోనూ గోల్డెన్​ డకౌట్​గా పెవిలియన్ చేరి కెరీర్​లో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్​గా ఆడిన మొదటి రెండు మ్యాచ్​ల్లో గోల్డెన్​ డకౌట్ అవ్వడం ఇదే మొదటిసారి.

అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో స్వల్ప లక్ష్య ఛేదనలో కృనాల్​​ 14 పరుగులకే పరిమితమయ్యాడు.​ ఇలా బ్యాటర్​గా, మరోవైపు పటిష్ఠంగా ఉన్న జట్టును ముందుకు నడిపించలేక కెప్టెన్​గా కూడా విఫలమవుతున్నాడు. ఈ ఐపీఎల్​ సీజన్​లో 11 మ్యాచ్​లు ఆడిన లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ ప్రస్తుతం 11 పాయింట్లతో మెరుగైన (3వ) స్థానంలోనే ఉందని చెప్పవచ్చు. ఇకపై ఆడే మూడు మ్యాచ్​లు లఖ్​నవూకు ముఖ్యమైనవే. మరి కృనాల్ ఒత్తిడిని అధిగమించి కెప్టెన్​గా సక్సెఫుల్​ కావాలని అతడి అభిమానులు ఆశిస్తున్నారు. ఫ్లే ఆఫ్​కు చేరాలంటే రన్​రేట్​ కూడా కీలకం కానుంది అందుకని కృనాల్​ తన ఆటపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఆల్​ రౌండర్​గా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.

ఇకపోతే కృనాల్​ను మొదటగా ముంబయి ఇండియన్స్ జట్టు 2016 వేలంలో రూ. 2 కోట్లకు దక్కించుకుంది. ఆరు సీజన్లు ముంబయి విజయాల్లో కీలకంగా మారాడు. కాగా గత సీజన్​ నుంచి కృనాల్​ లఖ్​నవూ జట్టుకు ఆడుతున్నాడు. ఐపీఎల్​ మొత్తంగా 96 ఇన్నింగ్స్​ల్లో 1,448 పరుగులు చేయగా.. 101 ఇన్నింగ్స్​ల్లో 67 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్​లో 11 ఇన్నింగ్స్​ల్లో కలిపి కేవలం 122 పరుగులు చేసిన కృనాల్​ బౌలింగ్​లో 6 వికెట్లే పడగొట్టి చెత్త ప్రదర్శన కొనసాగిస్తున్నాడు.

ఇంకోవైపు తన తమ్ముడు హార్దిక్ పాండ్య కెప్టెన్​గా అద్భుతంగా రాణిస్తున్నాడు. గత సీజన్​ నుంచి హార్దిక్ గుజరాత్ జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు. కెప్టెన్​గా ఆడిన మొదటి సీజన్​లోనే తమ జట్టును టైటిల్​ విజేతగా నిలబెట్టాడు. కాగా వీరిద్దరూ 2021 సీజన్ వరకూ ముంబయి జట్టులో కీలక ఆటగాళ్లు. 2022లో రిటెన్షన్​ పద్దతిలో ముంబయి ఈ ఇద్దరినీ వదులుకొంది.

ఐపీఎల్ చరిత్రలో తొలిసారి..
ఆదివారం నాటి లఖ్​నవూ, గుజరాత్ మ్యాచ్​ మరో అద్భుత ఘట్టానికి వేదికైంది. ఈ మ్యాచ్​లో హార్దిక్​ పాండ్య, కృనాల్​ పాండ్య అన్నదమ్ములు తలపడ్డారు. ఇదివరకు అన్నదమ్ములు.. వేర్వేరు జట్లకు, ఒకే జట్టుకు ఆడిన సందర్భాలు ఉన్నాయి. కానీ, తొలిసారి ప్రత్యర్థి జట్లకు కెప్టెన్లుగా ఉన్న సోదరులుగా హర్దిక్ పాండ్య, కృనాల్‌ పాండ్య రికార్డు సృష్టించారు.

Last Updated : May 8, 2023, 2:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.