ఐపీఎల్ 2023కు స్టార్ ఆటగాళ్లు షకీబ్ అల్ హసన్, శ్రేయస్ అయ్యర్‌లు దూరం కావడంతో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అంతర్జాతీయ క్రికెట్, వ్యక్తిగత కారణాల వల్ల షకీబ్ అల్ హసన్ ఐపీఎల్‌కు దూరం అయ్యాడు. ఇప్పుడు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఇంగ్లాండ్ విధ్వంసకర బ్యాటర్ జేసన్ రాయ్‌ను ఐపీఎల్ 2023 కోసం జట్టులో చేర్చుకుంది.
2022 డిసెంబర్‌లో జరిగిన మినీ వేలంలో షకీబ్ అల్ హసన్‌ను రూ.1.5 కోట్ల ధర చెల్లించి కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో చేర్చుకుంది. అయితే కొన్ని కారణాల వల్ల అతడు ఈ సంవత్సరం టోర్నమెంట్‌లో నుంచి తప్పుకున్నాడు. అతడితో పాటు ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యాడు. ఇప్పుడు జేసన్ రాయ్ రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో భాగమయ్యాడు.
-
We can't be more excited to share this news with you, fam! 🤩
— KolkataKnightRiders (@KKRiders) April 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
𝘚𝘸𝘢𝘨𝘢𝘵𝘢𝘮, @JasonRoy20! 💜#AmiKKR #TATAIPL2023 pic.twitter.com/Ta0yrBsyyk
">We can't be more excited to share this news with you, fam! 🤩
— KolkataKnightRiders (@KKRiders) April 5, 2023
𝘚𝘸𝘢𝘨𝘢𝘵𝘢𝘮, @JasonRoy20! 💜#AmiKKR #TATAIPL2023 pic.twitter.com/Ta0yrBsyykWe can't be more excited to share this news with you, fam! 🤩
— KolkataKnightRiders (@KKRiders) April 5, 2023
𝘚𝘸𝘢𝘨𝘢𝘵𝘢𝘮, @JasonRoy20! 💜#AmiKKR #TATAIPL2023 pic.twitter.com/Ta0yrBsyyk
ఐపీఎల్ 16వ సీజన్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.2.8 కోట్లు చెల్లించి జేసన్ రాయ్‌ను జట్టులోకి తీసుకుంది. జేసన్ రాయ్ బేస్ ధర రూ. 1.5 కోట్లు. దాదాపు రెట్టింపు బేస్ ప్రైస్ చెల్లించి కోల్‌కతా అతడిని జట్టులో చేర్చుకుంది. జేసన్ రాయ్ ఇంగ్లాండ్ తరఫున మూడు ఫార్మాట్‌ల్లోనూ ఆడతాడు. అదే సమయంలో వైట్ బాల్ క్రికెట్‌లో అతడికి మంచి రికార్డులు ఉన్నాయి.
జేసన్ రాయ్ తన టీ20 కెరీర్‌లో మొత్తం 313 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో 307 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన రాయ్ 27.77 సగటు, అద్భుతమైన 141.90 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 8,110 పరుగులు చేశాడు. ఇందులో అతడు మొత్తం ఆరు సెంచరీలు, 53 హాఫ్ సెంచరీలు సాధించాడు. అదే సమయంలో అతడి అత్యధిక స్కోరు 145 నాటౌట్‌గా ఉంది.
ఇంగ్లాండ్‌కు చెందిన జేసన్ రాయ్ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటి వరకు మొత్తం ఐదు టెస్టులు, 116 వన్డేలు, 64 టీ20లు ఆడాడు. అతడు టెస్టుల్లో 18.70 సగటుతో 187 పరుగులు, వన్డేల్లో 39.91 సగటుతో 4271 పరుగులు, టీ20 ఇంటర్నేషనల్స్‌లో 24.15 సగటు, 137.61 స్ట్రైక్ రేట్‌తో 1522 పరుగులు చేశాడు.
లీగ్‌లో తొలి మ్యాచ్‌లో కోల్‌కతాకు భారీ షాక్ తగిలింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ద్వారా ఓటమిపాలైంది. ఇప్పుడు రెండో మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది. రాయల్ ఛాలెంజర్స్‌తో గురువారం తలపడనుంది. ఈ సీజన్లో బోణీ కొట్టాలని ఉవ్విల్లూరుతోంది.