ETV Bharat / sports

IPL 2023: గుజరాత్ టైటాన్స్​ ఖాతాలో మరో విక్టరీ - who won today ipl match

దిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్​లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా రాణించింది. మ్యాచ్​లో విజయం సాధించింది.

ipl-2023-gujarat-titans-vs-delhi-capitals
దిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ టైటాన్స్
author img

By

Published : Apr 4, 2023, 11:03 PM IST

Updated : Apr 5, 2023, 6:52 AM IST

గుజరాత్‌ టైటాన్స్​ మళ్లీ మెరిసింది. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో అద్భుత ప్రదర్శన చేసింది. వరుసగా రెండో విజయాన్ని అందుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. తొలుత బౌలింగ్​తో ఆకట్టుకున్న ఆ జట్టు​.. ఆ తర్వాత బ్యాటింగ్​లోనూ రాణించింది. పవర్​ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయినా.. రన్​రేట్ మాత్రం తగ్గకుండా చూసుకుంది. గత మ్యాచ్‌లో 'ఇంపాక్ట్‌ ప్లేయర్‌'గా ఆడి, ఈసారి తుది జట్టులో చోటు దక్కించుకున్న తమిళనాడు కుర్రాడు సాయి సుదర్శన్‌ (62 నాటౌట్‌; 48 బంతుల్లో 4×4, 2×6) కీలక ఇన్నింగ్స్‌ ఆడడంతో 163 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్‌ 6 వికెట్ల తేడాతో ఛేదించింది. ఫలితంగా దిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది.

మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ క్యాపిటల్స్​కు గుజరాత్‌ కళ్లెం వేసింది. అయితే వరుసగా వికెట్లను చేజార్చుకున్న దిల్లీ.. అక్షర్‌ పటేల్‌ దూకుడుతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ వార్నర్ 37 పరుగులు, సర్ఫరాజ్ ఖాన్ 30 పరుగులు చేశారు. చివర్లో అక్షర్ పటేల్ 36 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో షమీ, రషీద్ ఖాన్ తలో 3 వికెట్లు పడగొట్టారు.

ఛేజింగ్​లో గుజరాత్​కు ధనాధన్ ఆరంభమే దక్కింది. దిల్లీ తరఫున ఇంపాక్ట్ ప్లేయర్​గా జట్టులోకి వచ్చి తొలి ఓవర్ వేసిన ఖలీల్ అహ్మద్​ను.. సాహా ఓ ఆటాడుకున్నాడు. మూడు, నాలుగు బంతులకు ఫోర్లు బాదిన అతడు.. చివరి బందిని ఏకంగా స్టాండ్స్​లోకి పంపాడు. దీంతో ఆ ఓవర్​లో 14 పరుగులు వచ్చాయి. రెండో ఓవర్​ను సైతం శుభ్​మన్ ధాటిగా ఆరంభించాడు. రెండు ఫోర్లు బాదాడు. అయితే, దూకుడుగా ఆడుతున్న ఈ జంటను అన్రిచ్ నోకియా విడగొట్టాడు. మూడో ఓవర్​లో సాహా, నాలుగో ఓవర్​లో గిల్​ను వెనక్కి పంపాడు. ఇద్దరినీ క్లీన్ బౌల్డ్ చేశాడు. సారథి హార్దిక్ పాండ్య(5) బ్యాటింగ్​లో నిరాశపర్చాడు. అయితే, వన్​డౌన్​లో వచ్చిన సాయి సుదర్శన్, ఆల్​రౌండర్ విజయ్ శంకర్.. సమయోచితంగా బ్యాటింగ్ చేశారు. సింగిల్స్ తీస్తూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. దీంతో గుజరాత్ పని తేలికైంది. లక్ష్యానికి చేరువగా వెళ్లింది. అయితే, ఓ అద్భుతమైన బంతితో మిచెల్ మార్ష్.. శంకర్​ను పెవీలియన్​కు పంపాడు. దీంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది.

ఇవీ చదవండి:

Last Updated : Apr 5, 2023, 6:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.