ETV Bharat / sports

IPL 2023 : ధోనీ @250.. ఫైనల్​లో చెన్నై కెప్టెన్​ను ఊరిస్తున్న రికార్డిదే!

author img

By

Published : May 27, 2023, 10:55 PM IST

Dhoni IPL Matches : ప్రస్తుత ఐపీఎల్ సీజనే ధోనీకి చివరిది అంటూ వార్తలు వస్తున్న తరుణంలో.. అతడిని ఓ రికార్డు ఊరిస్తోంది. మరి ఆ రికార్డు ఎంటో తెలుసుకుందామా..

Ms Dhoni IPL
మహేంద్ర సింగ్​ ధోనీ

Dhoni IPL Matches : ఐపీఎల్​లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఓ అరుదైన ఘనతను అందుకోనున్నాడు. ఐపీఎల్ ప్రారంభమైన 2008 సంవత్సరం నుంచి మహీ ఇప్పటివరకు 16 సీజన్లలో కలిపి 249 మ్యాచ్​లు ఆడాడు. ఆదివారం గుజరాత్ తో జరిగే ఫైనల్​తో​ అతడు 250 మ్యాచ్​లు పూర్తి చేసుకోనున్నాడు.

ఈ క్రమంలో ఈ ఘనత సాధించిన మొదటి ఆటగాడిగా ధోనీ రికార్డులకెక్కనున్నాడు. ధోనీ తర్వాతి స్థానాల్లో వరుసగా ముంబయి ఇండియన్స్ కెప్టెన్​ రోహిత్ శర్మ(243), టీమ్ఇండియా సీనియర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్(242), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (237), చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (225)లు ఉన్నారు.

Ms Dhoni IPL
మహేంద్ర సింగ్​ ధోనీ

Dhoni IPL Matches Csk Rps : ఐపీఎల్ ప్రారంభం నుంచి ధోనీ చెన్నై ఫ్రాంచైజీతోనే ఉన్నాడు. మధ్యలో రెండు సీజన్ల పాటు (2016, 2017) చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై బోర్డు నిషేధం విధించింది. ఆ రెండు సంవత్సరాల పాటు ధోనీ.. రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ జట్టు తరఫున 30 మ్యాచ్​లు ఆడిన ధోనీ చెన్నై తరఫున 219 మ్యాచ్​లు ఆడాడు.

ఇప్పటి వరకు ఆ రెండు సీజన్లు మినహా మిగిలిన 14 సీజన్ల పాటు ధోనీనే చెన్నై కెప్టెన్. తన సారథ్యంలో ప్రస్తుత సీజన్​తో కలిపి చెన్నై 12 సార్లు ఫైనల్ చేరింది. 2010,2011,2018,2021 సీజన్లలో టైటిల్ విజేతగా నిలిచింది. దీంతో అత్యధిక ఐపీఎల్ ట్రోఫీలు నెగ్గిన జట్ల జాబితాలో ముంబయి ఇండియన్స్ (5) తర్వాత చెన్నై రెండో స్థానంలో ఉంది.

ధోనీ ఐపీఎల్ ఆల్​టైమ్ రికార్డులు..

  • ఐపీఎల్ 16 సీజన్లలో 249 మ్యాచ్​ల్లో 217 ఇన్నింగ్స్​లు ఆడిన ధోనీ 39 సగటున 136 స్ట్రయిక్ రేట్​తో 5082 పరుగులు చేశాడు. ఇందులో 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
  • ఐపీఎల్​లో అత్యధిత పరుగుల వీరుల లిస్ట్​లో ధోనీది ఏడో స్థానం. విరాట్ కోహ్లీ 7263 పరుగులతో టాప్​లో కొనసాగుతున్నాడు.
  • కెప్టెన్​గా ధోనీ 4622 పరుగులతో రెండో ప్లేస్​లో ఉన్నాడు. ధోనీ కంటే ముందు విరాట్ కోహ్లీ 4881 ఫస్ట్​ ప్లేస్​లో ఉన్నాడు.
  • ఐపీఎల్​లో ధోనీ 239 సిక్సర్లు బాదాడు. అత్యధిక సిక్స్​లు బాదిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉండగా.. ఓవరాల్​గా నాలుగో స్థానంలో ఉన్నాడు.
  • వికెట్ కీపర్​గా ధోనీ 178 డిస్మిసల్స్​తో ప్రథమ స్థానంలో ఉన్నాడు. ఇందులో 137 క్యాచ్​లు, 41 స్టంపింగ్​లు ఉన్నాయి. ఈ జాబితాలో వరుసగా దినేశ్ కార్తీక్ 169, వృద్ధిమాన్ సాహా 106, రాబిన్ ఊతప్ప 90, పార్థీవ్ పటేల్ 81తో మొదటి ఐదు స్థానాల్లో భారత ఆటగాళ్లే ఉండటం విశేషం.

ఇకపోతే ధోనీ కెప్టెన్​గా చెన్నై జట్టుకు నాలుగు సార్లు ట్రోఫీ అందించాడు. ఈ జాబితాలో అత్యధికంగా రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్ (5)కు టైటిల్స్ అందించి టాప్​లో ఉన్నాడు. ఆదివారం జరిగే ఫైనల్​లో చెన్నై గుజరాత్​పై గెలిస్తే.. ధోనీ, రోహిత్ సరసన నిలుస్తాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.