ETV Bharat / sports

IPL 2023: దిల్లీ X ముంబయి.. టాస్​ ఎవరు గెలిచారంటే? - దిల్లీ ముంబయి మ్యాచ్​ ఐపీఎల్​ 2023

ఐపీఎల్​ 16వ సీజన్​లో భాగంగా దిల్లీ, ముంబయి జట్ల మధ్య మ్యాచ్​ ప్రారంభమైంది. అందులో భాగంగా టాస్​ ఎవరు గెలిచారంటే?

IPL 2023
IPL 2023
author img

By

Published : Apr 11, 2023, 7:07 PM IST

Updated : Apr 11, 2023, 7:57 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ 16వ సీజన్​లో భాగంగా.. దిల్లీ, ముంబయి జట్ల ​ మధ్య ఆసక్తికరమైన మ్యాచ్​ ప్రారంభమైంది. అందులో భాగంగా ముంబయి టాస్​ గెలిచి.. బౌలింగ్​ ఎంచుకుంది. ప్రత్యర్థి దిల్లీకి బ్యాటింగ్​ అప్పగించింది. అయితే, ఈ సీజన్​లో దిల్లీ, ముంబయి పేలవ ప్రదర్శన చేస్తున్నాయి. ముంబయి ఇండియన్స్​ జట్టు ఇప్పటివరకు రెండు మ్యాచ్​లు ఆడి.. రెండింట్లో ఓడిపోయింది. ఇక, దిల్లీ ఆడిన మూడు మ్యాచ్​ల్లోనూ బోల్తా కొట్టింది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ముంబయి, దిల్లీ నిలిచాయి.

దిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మనీశ్​ పాండే, యశ్ ధుల్, రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్ (వికెట్​ కీపర్), కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్టే, ముస్తాఫిజుర్ రెహమాన్

ముంబయి ఇండియన్స్ తుదిజట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషన్ కిషన్(వికెట్​ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హృతిక్ షోకీన్, అర్షద్ ఖాన్, పీయూష్ చావ్లా, జాసన్, రిలే మెరెడిత్

సమష్టి కృషి చేయాలి : డేవిడ్​ వార్నర్​
మేమంతా సమష్టిగా కష్టపడాలి. మా ఆటకు పదును పెట్టాలి. ఖలీల్​ అహ్మద్​కు గాయం కావడం వల్ల.. అతడి స్థానంలో యశ్​ ధుల్​ను తీసుకోవాల్సి వచ్చింది. అలాగే రిలీ రోస్సో ప్లేస్​లో ముస్తాఫిజుర్ రెహమాన్​ను తీసుకున్నాం. టీమ్​ అంతా సిద్ధంగా ఉన్నారు. పరిస్థితులను అర్ధం చేసుకుని ఆడాలి. హోమ్​ క్రౌడ్​ ముందు ఆడటం ఉత్సాహాన్నిస్తుంది. ​

మొదటి బ్యాటింగ్​ చేస్తే ఓడిపోయాం : రోహిత్​ శర్మ
ఇంతకుముందు రెండు మ్యాచ్​లలో బ్యాటింగ్​ చేశాం. వాటిలో ఓడిపోయాం. అందుకే ఇప్పుడు ముందుగా బౌలింగ్​ తీసుకున్నాం. పిచ్​ పొడిగా ఉంది. స్పిన్​కు అనుకూలిస్తుంది. దాంతో ఛేజింగ్ సులభం అవుతుందని భావిస్తున్నాం. స్టబ్స్​ స్థానంలో రిలీ మెరెడిత్​ను జట్టులోకి తీసుకున్నాం. జోఫ్రా జట్టులో లేడు. పరిస్థితులను బట్టి ఇంపాక్ట్​​ ప్లేయర్లను కూడా తీసుకుంటాం. ​

దిల్లీ తన మొదటి మ్యాచ్​ లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​తో ఆడింది. ఆ మ్యాచ్​లో 50 పరుగుల తేడాతో ఘోర పరాజం పాలైంది. రెండో మ్యాచ్​లోనైనా తేరుకుంటుంది అనుకుంటే.. గుజరాత్​ టైటాన్స్​ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి మూటగట్టుకుంది. ముచ్చటగా మూడో మ్యాచ్​లో దిల్లీని 57 పరుగులతో తేడాదో ఓడించింది రాజస్థాన్ రాయల్స్​ జట్టు. ​ముంబయి కూడా మొదటి మ్యాచ్​లో బెంగళూరు చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. రెండో మ్యాచ్​లోనూ ఏం మార్పు లేకుండా 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టు చేతిలో ఒటమి మూటగట్టుకుంది.

Last Updated : Apr 11, 2023, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.