ETV Bharat / sports

CSK VS RCB : డుప్లెసిస్‌ రిబ్స్​పై ఉన్న ఆ టాటూ అర్థం తెలుసా? - rcb won on csk

చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన రసవత్తర పోరులో విధ్వంసకర ఇన్నింగ్స్​ ఆడిన డుప్లెసిస్​ రిబ్స్​పై ఉన్న టాటూ ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. దాని అర్థం ఏంటా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. దాని గురించే ఈ కథనం..

duplesis ribs tattoo meaning
CSK VS RCB : డుప్లెసిస్‌ రిబ్స్​పై ఉన్న ఆ టాటూ అర్థం తెలుసా?
author img

By

Published : Apr 18, 2023, 4:40 PM IST

చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన ఆసక్తికర పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. సీఎస్కే నిర్దేశించిన 227 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో.. ఫాఫ్‌ డుప్లెసిస్‌ (62; 33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ( 76; 36 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లు) ధనాధన్​ ఇన్నింగ్స్‌లతో అదరగొట్టినప్పటికీ.. ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. అయితే డుప్లెసిస్‌-మ్యాక్స్​వెల్​ విధ్వంకర ఇన్నింగ్స్‌లపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ డాషింగ్‌ బ్యాటర్ల ఇన్నింగ్స్​లకు క్రికెట్​ ప్రియులంతా ఫిదా అయిపోయారు. వారిద్దరిని కొనియాడుతున్నారు. అప్పటికీ గెలిచింది సీఎస్కే జట్టు అయినప్పటికీ.. స్డేడియం మొత్తం డుప్లెసిస్‌-మ్యాక్సీల పేర్లతో మార్మోగిపోయింది. సోషల్​మీడియా కూడా వారిద్దరి ఆటతీరుపై ప్రశంసలతో హోరెత్తిపోయింది.

అయితే ఈ మ్యాచ్​లో కనిపించిన ఓ దృశ్యం కూడా నెటిజన్లను బాగా ఆకర్షించింది. బెంగళూరు బ్యాటింగ్‌ చేసే టప్పుడు 13వ ఓవర్‌ పూర్తైన తర్వాత డుప్లెసిస్‌ కాస్త ఇబ్బంది పడ్డాడు. అయితే అప్పటికే అతడికి పక్కటెముకలు చుట్టూ ఓ బ్యాండ్‌ కట్టి ఉంది. దాన్ని కాస్త సరిచేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. అప్పుడు క్రికెట్ అభిమానులు, నెటిజన్లు.. డుప్లెసిస్‌ రిబ్స్‌పై బ్యాండ్​పై ఉన్న ఓ టాటూను గమనించారు. ఆ టాటూ ఏంటీ? అది ఏ భాష? దాని అర్థం ఏంటి? అని ఆరా తీశారు. డుప్లెసిస్‌ బాడీపై చాలా టాటూస్‌ ఉన్నా ఈ టాటూ మాత్రం నెటిజన్లను ప్రత్యేకంగా కనిపించింది.

duplesis ribs tattoo meaning
డుప్లెసిస్‌ రిబ్స్​పై ఉన్న ఆ టాటూ అర్థం తెలుసా?

అయితే ఆ టాటూ అరబ్బీ భాషలోని ఓ పదమని.. దాని అర్థం దేవుడి దయ అని తెలిసింది. దేవుడి దయ వల్ల తన జీవితంలో జరిగిన మార్పులకు గుర్తుగా డుప్లెసిస్‌ ఈ టాటూను వేయించుకున్నాడని అంటున్నారు. ఇకపోతే డుప్లెసిస్‌ తన రిబ్స్​పై ఉన్న బ్యాండ్‌ గురించి కూడా వివరణ ఇచ్చాడు. రిబ్స్‌లో సమస్య ఉన్న కారణంగా ఈ బ్యాండ్‌ కట్టుకున్నట్లు తెలిపాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. సీఎస్కే 8 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. కాన్వే (83; 45 బంతుల్లో 6×4, 6×6), దూబె (52; 27 బంతుల్లో 2×4, 5×6), రహానె (37; 20 బంతుల్లో 3×4, 2×6) బాగా రాణించడంతో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేదనలో మ్యాక్స్‌వెల్‌ (76; 36 బంతుల్లో 3×4, 8×6), డుప్లెసిస్‌ (62; 33 బంతుల్లో 5×4, 4×6) చెలరేగిపోయినప్పటికీ ఆర్సీబీ ఓడిపోయింది. సీఎస్కే బౌలర్లు తుషార్‌ దేశ్‌పాండే (3/45), పతిరన (2/42) బెంగళూరు వికెట్లను కూల్చి గట్టిగా దెబ్బతీశారు.

ఇదీ చూడండి: IPL 2023 RCB VS CSK : చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద.. మ్యాచ్​ ఫొటోలు చూశారా ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.