సామ్ కరన్ (55) విధ్వంసక బ్యాటింగ్‌కు అర్ష్‌దీప్ (4/29) సూపర్ బౌలింగ్‌తో తోడవడం వల్ల.. ఆసక్తికరంగా సాగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. అయితే వాస్తవానికి ముంబయికి ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరమయ్యాయి. అది మరీ అసాధ్యమేమీ కాదు. కానీ అర్ష్‌దీప్.. ప్రత్యర్థి జట్టుకు ఏమాత్రం అవకాశమివ్వలేదు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కేవలం రెండే పరుగులిచ్చి రెండు వికెట్లను పడగొట్టాడు. తిలక్, వధేరాలను బౌల్డ్ చేశాడు. అతడి దెబ్బకు ఈ రెండు సందర్భాల్లోనూ స్టంప్ రెండు ముక్కలుగా విరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
ఎలా అంటే.. 215 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబయి జట్టులో రోహిత్ (44), కామెరూన్ గ్రీన్ (67), సూర్యకుమార్ యాదవ్ (57)ల విధ్వంసకర ఇన్నింగ్స్‌తో.. ఆ టీమ్ విజయానికి దగ్గరగా వెళ్లింది. అయితే చివరి ఓవర్లో ముంబయికి.. విజయానికి మరో 16 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలోనే క్రీజులో ఉన్నవధేరా, తిలక్ వర్మకు బంతులను సంధించాడు అర్ష్‌దీప్. మొదటి బంతికి ఒక పరుగే వచ్చింది. సెకండ్‌ది డాట్ బాల్. మూడో బాల్ యార్కర్ సంధించాడు. అయితే వేగంగా దూసుకొచ్చిన బాల్‌ను అంచనా వేయడంలో తిలక్ వర్మ కాస్త గతి తప్పాడు. దీంతో బాల్.. మిడిల్ స్టంప్ రెండు ముక్కలైంది. ఇక నాలుగో బంతికి కూడా మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. వధేరా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో వికెట్ కూడా గాల్లోకి ఎగిరి రెండు ముక్కలైంది.
విలువ ఎంతో తెలుసా..? చివరి ఓవర్లో అర్ష్‌దీప్ అద్భుతమైన యార్కర్లు సంధించాడు. బంతి వేగానికి మిడిల్ స్టంప్ రెండుసార్లు విరిగి నేలకొరిగింది. మరి విరిగిన వికెట్ ధర ఎంత.. అనేది సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టింది. అవి ఎల్‌ఈడీ స్టంప్‌లు. వాటి పైన ఉండే బెయిల్స్ కూడా ఎల్‌ఈడీవే. ఈ స్టంప్స్ బెయిల్స్ లో సెన్సార్ ఉంటుంది. దీని వల్ల బంతి.. స్టంప్స్, బెయిల్స్‌ను తాకిన వెంటనే అవి వెలుగుతాయి. 2014 టీ20 ప్రపంచకప్‌లో మొదటిసారి ఈ ఎల్‌ఈడీ స్టంప్స్, బెయిల్స్‌ను ఉపయోగించారు. అప్పటినుంచి వైట్ బాల్ క్రికెట్లో ఈ స్టంప్స్‌ను వాడుతున్నారు. అయితే ఈ ఐపీఎల్ సీజన్ కోసం వినియోగిస్తున్న ఒక్కో ఎల్‌ఈడీ స్టంప్స్, దానిపై ఉండే బెయిల్స్ సెట్ ధర రూ. 40 వేల డాలర్లు అని తెలిసింది. అంటే దాదాపు రూ. 30 లక్షలు అన్న మాట. కేవలం స్టంప్స్ సెట్ ధర రూ. 24 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. కాగా, వాంఖడే వేదికగా ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 13 పరుగుల తేడాతో గెలుపొందింది.
-
Stump breaker,
— JioCinema (@JioCinema) April 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Game changer!
Remember to switch to Stump Cam when Arshdeep Akram bowls 😄#MIvPBKS #IPLonJioCinema #IPL2023 #TATAIPL | @arshdeepsinghh pic.twitter.com/ZnpuNzeF7x
">Stump breaker,
— JioCinema (@JioCinema) April 22, 2023
Game changer!
Remember to switch to Stump Cam when Arshdeep Akram bowls 😄#MIvPBKS #IPLonJioCinema #IPL2023 #TATAIPL | @arshdeepsinghh pic.twitter.com/ZnpuNzeF7xStump breaker,
— JioCinema (@JioCinema) April 22, 2023
Game changer!
Remember to switch to Stump Cam when Arshdeep Akram bowls 😄#MIvPBKS #IPLonJioCinema #IPL2023 #TATAIPL | @arshdeepsinghh pic.twitter.com/ZnpuNzeF7x
ఇదీ చూడండి: IPL 2023 PBKS VS MI : పంజాబ్ 'కింగ్' అర్ష్‌దీప్.. ప్లేయర్స్ విన్యాసాలు చూశారా?