ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన టీమ్ఇండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్.. ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యాడు. తీవ్రంగా గాయపడిన పంత్.. పలు సర్జరీల అనంతరం మెల్లగా కోలుకుంటున్నాడు. ఇటీవలే అతడిని టీమ్ఇండియా మాజీలు కలిశారు. అయితే పంత్ కోలుకోవడానికి మరో తొమ్మది నెలలకుపైగా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో దిల్లీ క్యాపిటల్స్ నాయకత్వ బాధ్యతలు.. డేవిడ్ వార్నర్‌కు అప్పగించింది. వైస్ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను నియమించింది.
అయితే పంత్ స్థానంలో మాత్రం ఇప్పటివరకు ఎవరిని ఎంపిక చేయని దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ.. తాజాగా సంచలన బ్యాటర్‌ను జట్టులోకి తీసుకుందట. బంగాల్ యంగ్ వికెట్ కీపర్, బ్యాటర్ అభిషేక్ పోరెల్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని దిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ప్రకటించలేదు. కాగా, అభిషేక్ పోరెల్.. బంగాల్ తరఫున 16 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 695 పరుగులు సాధించాడు. అందులో హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
అయితే ఐపీఎల్‌లో నాయకుడిగా వార్నర్‌కు కూడా ఘనమైన రికార్డు ఉంది. గతంలో ఎస్‌ఆర్‌హెచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన వార్నర్ 67 మ్యాచ్‌ల్లో 35 విజయాలు అందుకున్నాడు. అంతేకాదు ఎస్‌ఆర్‌హెచ్‌కు 2016లో ఐపీఎల్ టైటిల్ కూడా అందించాడు. తాజాగా అతడి నాయకత్వంలో దిల్లీ క్యాపిటల్స్ ఈసారి టైటిల్ కొట్టబోతుందని జట్టు హెడ్‌కోచ్ రికీ పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. ''పంత్ ఐపీఎల్‌కు ఫిజికల్‌గా దూరమైనప్పటికీ అతడు మాతోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నాం.. అతడి జెర్సీ నెంబర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీపై ప్రత్యేకంగా ముద్రించాలనుకుంటున్నాం'' అంటూ పాంటింగ్ తెలిపాడు.
దిల్లీ క్యాపిటల్స్ జట్టు: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, చేతన్ సకారియా, కమలేష్ నాగర్‌కోటి, ఖలీల్ అహ్మద్, లుంగి ఎన్‌గిడి, ముస్తాఫిజుర్ రెహమాన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, ఫిల్ సాల్ట్, ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్, మనీశ్ పాండే, రిలీ రోసోవ్, రిపాల్ పటేల్, అభిషేక్ పోరెల్.
గతేడాది డిసెంబర్‌లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు పంత్. దిల్లీ నుంచి లఖ్‌నవూ వస్తుండగా రూర్కీ సమీపంలో అతడి కారు ప్రమాదానికి గురయ్యింది. దీంతో పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పలు సర్జరీలు నిర్వహించగా ప్రస్తుతం పంత్ కోలుకుంటున్నాడు. ఐపీఎల్‌తో పాటు వన్డే వరల్డ్‌కప్‌కు కూడా పంత్ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.