IPL 2023 : ఐపీఎల్ 2023లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. ఆది నుంచే ఆధిపత్యం కనబర్చింది. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా సునాయాసంగా విజయం సాధించింది. శుభ్‌మన్ గిల్ (38) పరుగులతో మెరిశాడు. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(41*), హార్ధిక్ పాండ్య (39*) పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు నడిపించారు. రాజస్థాన్ బౌలర్లు చాహల్ ఒక వికెట్ తీశాడు.
అంతకుముందు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ జట్టు.. 17.5 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్ విభాగం పూర్తిగా కుప్పకూలింది. బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దీంతో ఆ జట్టు తక్కువ స్కోరుకే రాజస్థాన్ ఆలౌట్ అయింది. ఇక ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్ (14) ఈ మ్యాచ్‌లో రన్ అవుట్ అయ్యాడు. అంతకుముందు రెండు బౌండరీలు బాది మంచి జోరు మీద కనిపించిన జోస్ బట్లర్ (8) ఆ మరుసటి బంతిని కట్ చేయబోయి ఔట్ అయ్యాడు. ఇక, సంజూ శాంసన్ (30) ఫర్వాలేదనిపించినా ఎక్కువ సేపు ఆడలేకపోయాడు. దేవదత్ పడిక్కల్ (12), అశ్విన్ (2) నిరాశపరిచారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి ఇంపాక్ట్ చూపిస్తాడనుకున్న రియాన్ పరాగ్ (4) కూడా పేలవ ప్రదర్శన చేశాడు. హిట్మయర్ (7), ధృవ్ జురెల్ (9), ట్రెంట్ బౌల్ట్ (15), చివర్లో ఆడమ్ జంపా (7) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఇక, గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ (3) వికెట్లు తీసి అదరగొట్టాడు. నూర్ అహ్మద్ (2) వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్య, జోషువా లిటిల్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
వైఫల్యాల రియాన్ పరాగ్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..
ఈ ఐపీఎళ్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ఆటగాడు రియాన్ పరాగ్ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కేవలం 6 పరుగులకే ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఈ సీజన్లో 6 మ్యాచ్‌లు ఆడిన పరాగ్.. అన్నింట్లో 20 పరుగుల మార్క్‌ను కూడా దాటలేకపోయాడు. హైదరాబద్‌తో జరిగిన మ్యాచ్ 6 బంతుల్లో 7 పరుగులు చేశాడు. పంజాబ్‌పై 20 పరుగులు (12 బంతుల్లో), దిల్లీపై 7 (11), గుజరాత్‌పై 5 (7), లఖ్‌నవూపై 15* (12) పరుగులు చేశాడు. 'దీంతో ఆట తక్కువ ఓవరాక్షన్ ఎక్కువ' అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇవీ చదవండి : టీమ్ఇండియాకు షాక్ .. WTC ఫైనల్ నుంచి కేఎల్ రాహుల్ ఔట్