ETV Bharat / sports

IPL 2023 GT VS DC : దిల్లీ క్యాపిటల్స్​ గట్టెక్కింది - delhi capitals won match on gujarat

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్ 16వ సీజన్​లో భాగంగా గుజరాత్​ టైటాన్స్​, దిల్లీ క్యాపిటల్స్​ మధ్య మ్యాచ్​ జరిగింది. దిల్లీ బ్యాటర్​ అమన్​ హకీమ్​ ఖాన్​ హాఫ్​ సెంచరీతో రాణించగా.. గుజరాత్​ బౌలర్​ మహ్మద్​ షమీ నాలుగు వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో దిల్లీ 5 పరుగులు తేడాతో విజయం సాధించింది.

Gujarat Titans vs Delhi Capitals
Gujarat Titans vs Delhi Capitals
author img

By

Published : May 2, 2023, 11:11 PM IST

Updated : May 3, 2023, 6:24 AM IST

ఐపీఎల్ 16వ సీజన్​లో స్వల్ప లక్ష్యాలను కాపాడుకునే ట్రెండ్‌ కొనసాగుతుందనే చెప్పాలి. రీసెంట్​గా లఖ్‌నవూ సూపర్​ జెయింట్స్​పై కేవలం 127 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని రాయల్​ ఛాలెంజర్​ బెంగళూరు గెలిస్తే.. ఇప్పుడు గుజరాత్‌ టైటాన్స్​పై దిల్లీ క్యాపిటల్స్​ 130 పరుగులే చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకుని ఆశ్చర్యపరిచింది. తాజాగా జరిగిన మ్యాచ్​లో దిల్లీ నిర్దేశించిన 131 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్​.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా దిల్లీ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్​లో ఆడియన తొమ్మిది మ్యాచ్‌ల్లో మూడో విజయంతో ఆ జట్టు ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా చెేసుకుంది.

లక్ష్యఛేధనలో గుజరాత్​లో ఓపెనర్​ వృద్ధిమాన్​ సాహా(0) ఆరు బంతులు ఎదుర్కొని డకౌట్​ అయ్యాడు. మరో ఓపెనర్​ శుభ్​మన్​ గిల్​ (6) పరుగులకే పెవిలియన్​ చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్​ చేసిన హార్దిక్​​ పాండ్య (59 నాటౌట్‌; 53 బంతుల్లో 7×4) హాఫ్​ సెంచరీ పూర్తి చేసి స్కోర్​ బోర్డును పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత వచ్చిన విజయ్​ శంకర్​ (6), డేవిడ్​ మిల్లర్​ (0) పేలవ ప్రదర్శన చేశారు. అనంతరం అభినవ్​ మనోహర్​ నిలకడగా ఆడి (26) ఫర్వాలేదనిపించాడు. అభినవ్​ మనోహర్​ (26; 33 బంతుల్లో 1×6), రాహుల్​ తెవాతియా (20) పరుగులు చేశారు. దిల్లీ​ బౌలర్లలో ఖలీద్​ అహ్మద్​ (2/24) వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్​ శర్మ (2/23), ​ నోకియా (1), కుల్దీప్​ యాదవ్​(1/15) వికెట్లు పడగొట్టి టైటాన్స్​ను దెబ్బతీశారు.

అంతకుముందు టాస్​ గెలిచి బ్యాటింగ్​ చేసిన దిల్లీ క్యాపిటల్స్.. బౌలర్ షమీ(4/11) ధాటికి.. ​ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులే చేసింది. ఓపెనర్​ సాల్ట్​ను బౌలర్​ షమీ మొదటి బంతితే డకౌట్​ చేశాడు. ఆ తర్వాత వచ్చిన వార్నర్​ను (2) పెవిలియన్​ పంపించాడు రషీద్ ఖాన్​. ఆ తర్వాత తన విశ్వరూపం చూపించిన మహ్మద్​ షమీ వరుసగా ప్రియం గార్గ్​ (10), రోసో (8), మనీశ్​ పాండే (1) ముగ్గురిని పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత వచ్చిన అక్షర్​ పటేల్​ (27), అమన్​ హకీమ్​ ఖాన్​ (51), రిపాల్​ పటేల్​ (23) నిలకడగా ఆడి స్కోర్​ బోర్డును కదిలించారు. నోకియా (3*), కుల్దీప్​ యాదవ్ (0*) స్కోరు చేశారు. ఇక, గుజరాత్​ బౌలర్లలో మహ్మద్​ షమీ.. నాలుగు వికెట్లు తీసి దిల్లీ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. మోహిత్​ శర్మ (2), రషీద్ ఖాన్​ (1) వికెట్లు పడగొట్టాడు.

ఇదీ చూడండి: విరాట్​, గంభీర్​ మధ్య ఏం జరిగింది?.. పూసగుచ్చినట్టు చెప్పిన ప్రత్యక్ష సాక్షి!

Last Updated : May 3, 2023, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.