Washington Sundar injury: రెండు వరుస ఓటములతో డీలా పడ్డ సన్‌రైజర్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఆల్‌రౌంటర్ వాషింగ్టన్ సుందర్ మళ్లీ గాయపడ్డాడు. ఇదివరకే గాయంతో మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు ఈ ప్లేయర్. తాజా గాయంతో మరోసారి జట్టుకు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదివారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా సుందర్ గాయపడ్డాడు. బౌలింగ్ చేసే చేతికే గాయం కావడం వల్ల.. మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై తీవ్ర ప్రభావం పడింది. పార్ట్ టైమ్ స్పిన్నర్లతో బౌలింగ్ చేయించాల్సి వచ్చింది. చివర్లో బ్యాటింగ్‌కు వచ్చినప్పటికీ.. రెండు బంతులు ఆడి పెవిలియన్ చేరాడు సుందర్.
IPL 2022 Washington Sundar: కాగా, ఇదివరకు గాయం అయిన చోటే సుందర్‌కు ఇప్పుడు మళ్లీ గాయమైందని సన్‌రైజర్స్ కోచ్ టామ్ మూడీ తెలిపాడు. గత గాయం నుంచి సుందర్ పూర్తిగా కోలుకున్నాడని చెప్పాడు. అయితే దాన్ని తిరగబెట్టే స్థాయిలో ప్రస్తుత గాయం లేదని స్పష్టం చేశాడు. కుట్లు వేయాల్సిన అవసరం లేకపోవచ్చని అన్నాడు. అయితే, అతడు బౌలింగ్ చేసే పరిస్థితుల్లో కూడా లేడని బాంబు పేల్చాడు. అతడు లేకపోవడం తమకు తీరని లోటు అని చెప్పుకొచ్చాడు. సన్‌రైజర్స్ తన తర్వాతి మ్యాచ్‌ను దిల్లీతో ఆడనుంది. మూడీ వ్యాఖ్యలను బట్టి ఈ మ్యాచ్‌కు సుందర్ దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: IPL 2022: ఆ లెక్క దాటాలంటే లక్ ఉండాలి బాసూ!