IPL 2022 RR Vs Dc: రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 161 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లనే ఛేదించింది. మిచెల్ మార్ష్ (89; 62 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లు), డేవిడ్ వార్నర్ (52; 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో రాణించారు. దిల్లీ మిగతా బ్యాటర్లలో శ్రీకర్ భరత్ (0) డకౌట్ కాగా.. రిషభ్ పంత్ (13; 4 బంతుల్లో 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీశారు.
దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్లు అశ్విన్ (50), దేవదత్ పడిక్కల్ (48) రాణించడం వల్ల ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. రాజస్థాన్ మిగతా బ్యాటర్లలో యశస్వీ జైస్వాల్ (19), జోస్ బట్లర్ (7), సంజూ శాంసన్ (6), రియాన్ పరాగ్ (9), డస్సెన్ (12*), ట్రెంట్ బౌల్ట్ (3*) పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లలో చేతన్ సకారియా, ఆన్రిచ్ నార్జ్, మిచెల్ మార్ష్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
ఇవీ చదవండి: IPL 2022: అన్క్యాప్డ్ ప్లేయర్స్.. ఈ సారి అద్భుతాలు సృష్టించారుగా!
IPL 2022: రషీద్, గిల్ అరుదైన రికార్డు.. సచిన్, బ్రావో సరసన చోటు