IPL 2022: ముంబయి ఇండియన్స్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అనూజ్ రావత్ (66), విరాట్ కోహ్లీ (48) మెరుగ్గా రాణించారు. డుప్లెసిస్ (16) ఫర్వాలేదనిపించాడు. దీంతో హ్యాట్రిక్ గెలుపును అందుకున్న బెంగళూరు.. ముంబయికి నాలుగో మ్యాచ్‌లోనూ ఓటమిని కట్టబెట్టింది. ముంబయి బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్, డెవాల్డ్ బ్రెవిస్ చెరో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (68* : 37 బంతుల్లో 5×4, 6×6) అర్ధ శతకంతో రాణించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (26), ఇషాన్ కిషన్ (26) ముంబయికి శుభారంభాన్నందించారు. డెవాల్డ్ బ్రెవిస్ (8), రమణ్ దీప్ సింగ్ (6) విఫలమయ్యారు. తిలక్ వర్మ (0), కీరన్ పొలార్డ్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. జయదేవ్ ఉనద్కట్ (13*) పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్లలో వనిందు హసరంగ, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్ దీప్ ఒక వికెట్ తీశాడు.
ఇదీ చూడండి: ఐపీఎల్లో హైదరాబాద్ బోణీ.. చెన్నై నాలుగో ఓటమి