ETV Bharat / sports

IPL 2022: ఉత్కంఠ పోరులో కోల్​కతాపై రాజస్థాన్ విజయం​.. హ్యాట్రిక్ తీసిన చాహల్​​

IPL 2022: ఉత్కంఠగా సాగిన పోరులో రాజస్థాన్ కోల్​కతాపై విజయం సాధించింది. 218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్​కతా 210 పరుగులకు ఆలౌటైంది. చివర్లో రాజస్థాన్​ బౌలర్​ యజ్వేంద్ర చాహల్​ హ్యాట్రిక్​ తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ipl 2022
ipl 2022
author img

By

Published : Apr 18, 2022, 11:45 PM IST

Updated : Apr 19, 2022, 12:02 AM IST

IPL 2022: కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్​కతాకు.. బ్యాటర్లు ఆది నుంచి దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆఖరి ఓవర్​ వరకు సాగిన మ్యాచ్​లో కోల్​కతా 210 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్​ ఆరోన్ ఫించ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 9 ఫోర్లు, రెండు సిక్సులతో 28 బంతుల్లోనే 58 పరుగులు చేశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 బంతుల్లోనే 85 పరుగులతో దూకుడుగా ఆడాడు. చివర్లో ఉమేష్​ యాదవ్​ పోరాడినా ఫలితం దక్కలేదు. రాజస్థాన్​ బౌలర్​ యజ్వేంద్ర చాహల్​ హ్యాట్రిక్​ తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన రాజస్థాన్.. భారీ స్కోరు సాధించింది. ఆ జట్టు బ్యాటర్లు ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించారు. ఓపెనింగ్​కు దిగిన జోస్ బట్లర్ మరోసారి శతకంతో చెలరేగాడు. క్రీజులోకి రావడం ఆలస్యం ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. వన్​డౌన్​లో దిగిన సంజూ శాంసన్ సైతం పరుగుల వరద పారించాడు. దీంతో రాజస్థాన్ 20 ఓవర్లలో 217 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐదు వికెట్లు కోల్పోయింది.

ఇదీ చదవండి: బట్లర్ వీరబాదుడు... మళ్లీ సెంచరీ... రాజస్థాన్ భారీ స్కోరు

Last Updated : Apr 19, 2022, 12:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.