IPL ORANGE PURPLE CAPS: టీ20 లీగ్‌లో లీగ్ దశ మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. గత ఛాంపియన్లు ఢీలా పడుతుండగా.. కొత్త జట్లు చెలరేగుతున్నాయి. ఆరంభంలో ఓటములతో లీగ్‌ను ప్రారంభించిన టీమ్‌లు వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో టీ20 లీగ్‌లో ఇప్పటి వరకు జరిగిన 29 మ్యాచుల్లో భారీగా పరుగులు చేస్తున్న బ్యాటర్లు.. వికెట్లను కుప్పకూలుస్తున్న బౌలర్లు ఎవరో ఓసారి పరిశీలిద్దాం.. అలానే ఇప్పటి వరకు నమోదైన సిక్సర్లు, ఫోర్లలో ఏ బ్యాటర్ అధికంగా బాదారో కూడా తెలుసుకుందాం..
సెంచరీలు.. అత్యధిక పరుగుల వీరులు వీరే..: మంచి ఫామ్‌లో ఉన్న బ్యాటర్లలో జోస్ బట్లర్ (రాజస్థాన్), కేఎల్ రాహుల్ (లఖ్‌నవూ) ముందున్నారు. వీరిద్దరే ఈ సీజన్‌లో ఇప్పటి వరకు సెంచరీలు నమోదు చేశారు. బట్లర్ (100) ముంబయి మీద శతకం చేయగా.. కేఎల్ రాహుల్ (103) కూడా రోహిత్ సేనపైనే సెంచరీ బాదడం విశేషం. ఇప్పటి వరకు జోస్ బట్లర్ ఐదు మ్యాచుల్లో ఒక శతకం, రెండు అర్ధశతకాలతో 272 పరుగులు చేసి అత్యధిక రన్స్ చేసిన జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. బట్లర్ తర్వాత కేఎల్ రాహుల్ (235), హార్దిక్ పాండ్య (228), శివమ్ దూబే (226), లియామ్ లివింగ్‌స్టోన్ (224), డికాక్ (212), రాహుల్ త్రిపాఠి (205), ధావన్ (205), సూర్యకుమార్ (200), గిల్ (200) ఉన్నారు.
భారీగా సిక్సర్లు, బౌండరీలు: అత్యధిక సిక్సర్లు బాదిన వారిలోనూ జోస్ బట్లర్ (రాజస్థాన్) అందరికంటే ముందున్నాడు. బట్లర్ 18 సిక్సర్లను కొట్టగా.. భారీ హిట్టర్ ఆండ్రూ రస్సెల్ (16), లియామ్ లివింగ్‌స్టోన్ (16), హెట్‌మయేర్ (15), దినేశ్ కార్తిక్ (14), శివమ్ దూబే (13), సూర్యకుఆమర్ యాదవ్ (12), రాబిన్ ఉతప్ప (12), రాహుల్ త్రిపాఠి (11), సంజూ శాంసన్ (10), కేఎల్ రాహుల్ (10) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. సిక్సర్లు జాబితాలో టాప్- 10లోనే లేని హార్దిక్ పాండ్య అత్యధిక ఫోర్లు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. హార్దిక్ ఇప్పటి వరకు 26 బౌండరీలను దంచేశాడు. తర్వాత డికాక్ (25), బట్లర్ (23), పృథ్వీ షా (22), ఇషాన్ కిషన్ (22), శిఖర్ ధావన్ (20), శుభ్‌మన్ గిల్ (20) భారీగా ఫోర్లను కొట్టారు.
వికెట్ల జాబితాకు తీవ్ర పోటీ: ఈసారి బౌలర్ల ప్రదర్శన అద్భుతమనే చెప్పాలి. పిచ్ నుంచి పూర్తిగా సహకారం లభించకపోయినా మంచి లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తున్నారు. అత్యధిక వికెట్ల జాబితాలో రాజస్థాన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, హైదరాబాద్ యార్కర్ స్పెషలిస్ట్ టి.నటరాజన్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. వీరిద్దరూ ఇప్పటి వరకు చెరో 12 వికెట్లు తీశారు. అయితే చాహల్ ఎకానమీ (6.80) కంటే నటరాజన్ (8.66) ఎకానమీ ఎక్కువైనప్పటికీ కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. వీరి తర్వాత కుల్‌దీప్ యాదవ్ (11), అవేశ్ ఖాన్ (11), వానిందు హసరంగ (11), ఉమేశ్ యాదవ్ (10), డ్వేన్ బ్రావో (10) ఉన్నారు. టీ20 లీగ్ బౌలర్లలో హర్షల్ పటేల్ మాత్రమే అధికంగా రెండు ఓవర్లను మెయిడిన్‌గా వేశాడు.
ఇదీ చదవండి: ఫినిషర్‌గా అదరగొడుతున్న డీకే... మహీని గుర్తు తెచ్చేలా...