ETV Bharat / sports

ఈ 'ఛాంపియన్స్​'​కు ఈసారి ఏమైంది? హ్యాట్రిక్​ ఓటములతో అట్టడుగున.. - రోహిత్​ శర్మ

IPL 2022 MI CSK: ఒకటేమో ఐదుసార్లు ఐపీఎల్​ ఛాంపియన్​.. మరొకటి డిఫెండింగ్​ ఛాంపియన్​ సహా నాలుగు టైటిళ్లు గెల్చుకున్న టీమ్​. అవే ముంబయి ఇండియన్స్​, చెన్నై సూపర్​ కింగ్స్​. ప్రస్తుత ఐపీఎల్​లో చెరో 3 మ్యాచ్​లు ఆడిన ఈ జట్లు ఇంకా ఖాతా తెరవలేదు. సన్​రైజర్స్​ హైదరాబాద్​ది కూడా ఇదే తీరు. దీంతో ఈ జట్లకు ఏమైందని ఆందోళన చెందుతున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో ఈ జట్లలో బలాలు, బలహీనతలు.. ఓటములకు గల కారణాలను ఓసారి పరిశీలిస్తే..

reasons Hat-trick Defeats for Mumbai Indians, Chennai super kings in ipl 2022

author img

By

Published : Apr 7, 2022, 12:46 PM IST

Updated : Apr 7, 2022, 2:20 PM IST

IPL 2022 MI CSK: 2022 ఐపీఎల్​ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 14 మ్యాచ్​లు అయిపోయాయి. ఇప్పటివరకు చూస్తే.. కొత్తగా వచ్చి చేరిన లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​, గుజరాత్​ టైటాన్స్​ బాగానే ఆడుతున్నాయి. కొన్నేళ్లుగా నిరాశాజనక ప్రదర్శన చేస్తున్నా.. కోల్​కతా నైట్​రైడర్స్​, రాజస్థాన్​ రాయల్స్​, పంజాబ్​ కింగ్స్​ వంటి జట్లు పాయింట్ల పట్టికలో పైభాగాన ఉండటం గమనార్హం. మరోవైపు.. ఐదుసార్లు ఐపీఎల్​ ఛాంపియన్​గా నిలిచిన ముంబయి ఇండియన్స్​, నాలుగు సార్లు విజేతగా నిలిచి డిఫెండింగ్​ ఛాంపియన్​ హోదాలో బరిలోకి దిగిన చెన్నై సూపర్​ కింగ్స్​ బోణీ కొట్టలేకపోయాయి.​ ఆడిన మూడింట్లో ఒక్కటీ గెలవలేక అభిమానుల్ని నిరాశ పరుస్తున్నాయి. 2020 సీజన్​ వరకు మంచి టీంగా పేరున్న సన్​రైజర్స్​ హైదరాబాద్​ తీరూ ఇంతే. రెండింటికి రెండూ ఓడి పాయింట్స్​ టేబుల్​లో అట్టడుగున ఉంది. ఈ నేపథ్యంలో ఈ జట్లకు ఏమైందని అభిమానులు కంగారు పడుతున్నారు. అసలు ఈ జట్లు ఎందుకు ఓడిపోతున్నాయో ఓసారి పరిశీలిద్దాం.

ముంబయి ఇండియన్స్​: ముంబయి ఇండియన్స్​ సాధారణంగా ప్రతి ఐపీఎల్​ సీజన్​ను నెమ్మదిగా ఆరంభిస్తోంది. ప్రారంభ మ్యాచ్​ల్లో ఓడటం.. తర్వాత పుంజుకోవడం ఈ జట్టుకు అలవాటే. గత పదేళ్లుగా తొలి మ్యాచ్​ ఓడిపోవడాన్ని.. సంప్రదాయంగా చేసుకుంది ముంబయి. అదే సమయంలో 2013-20 మధ్యలో ఎనిమిదింట్లో.. ఐదు సార్లు ముంబయిని(2013,15,17,19,20) ఛాంపియన్​గా నిలిపాడు కెప్టెన్​ రోహిత్​ శర్మ. అయితే.. ఎప్పటిలాగే ఈసారీ అనుకుంటే పొరపాటే. కారణం.. ఆడే విధానం. పరిస్థితులు మునుపటిలా లేవు. జట్టు పూర్తిగా మారిపోయింది. ముంబయికి చాన్నాళ్లుగా ఆడిన హార్దిక్​ పాండ్య, కృనాల్​ పాండ్య, రాహుల్​ చాహర్​, ట్రెంట్​ బౌల్ట్​, క్వింటన్​ డికాక్​ వంటి మ్యాచ్​ విన్నర్లు మెగా వేలంతో ఇతర జట్లలోకి వెళ్లారు. ఇది ముంబయికి పెద్ద దెబ్బ.

reasons Hat-trick Defeats for Mumbai Indians, Chennai super kings in ipl 2022
ముంబయి ఇండియన్స్​ జట్టు

ఈ సీజన్​కు ముందు ఐపీఎల్​ వేలంలో ముంబయి చురుగ్గానే ప్లేయర్ల కొనుగోలు చేపట్టిందని భావించినా.. మ్యాచ్​లు జరుగుతున్నకొద్దీ పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాటింగ్​లో కొదవ లేకపోయినప్పటికీ.. బౌలింగ్​లో చాలా బలహీనంగా కనిపిస్తోంది. గతంలో బుమ్రా, బౌల్ట్​, కృనాల్​, రాహుల్​ చాహర్​తో బలంగా కనిపించే బౌలింగ్​ లైనప్​ ఈసారి లేదు. బుమ్రాకు సహకారం అందించే మరో బౌలర్​ కరవయ్యాడు. స్పిన్నర్​ మురుగన్​ అశ్విన్​ ఆకట్టుకుంటున్నా నిలకడ లేదు. పేసర్లు టైమల్​ మిల్స్​, డేనియల్​ సామ్స్​, బాసిల్​ థంపి ధారాళంగా పరుగులు ఇచ్చుకుంటున్నారు. బౌలింగ్​లో మెరుగుపడకుంటే ఈసారి ముంబయి ప్లేఆఫ్స్​ చేరడం కష్టమే అని చెప్పొచ్చు.

బ్యాటింగ్​లో ఇషాన్​ కిషన్​, సూర్యకుమార్​ యాదవ్​, తిలక్​ వర్మ మంచి ఫామ్​లో ఉన్నారు. అరంగేట్ర మ్యాచ్​లో అదరగొట్టిన డెవాల్డ్​ బ్రెవిస్​పైనా నమ్మకం ఉంది. ఓపెనర్​ రోహిత్​ శర్మ తడబడుతున్నాడు. కెప్టెన్​ ముందుండి రాణించాల్సిన అవసరం ఉంది. అంతకుముందు కూడా బుమ్రా, పాండ్య సోదరులు సహా ఎందరో కొత్త కుర్రాళ్ల నుంచి అద్భుత ప్రదర్శన రాబట్టింది ముంబయి యాజమాన్యం. వారిలో చాలా మంది టీమ్​ఇండియాకు కూడా ఎంపికయ్యారు. ఇప్పుడు కూడా అదే తరహా టీమ్​ను తయారుచేసి.. ముంబయి మళ్లీ పుంజుకోవాలని ఆశిస్తున్నారు అభిమానులు.

చెన్నై సూపర్​ కింగ్స్​: చెన్నై సూపర్​ కింగ్స్​.. 2020 ఐపీఎల్​ మినహా ప్రతిసారీ ప్లేఆఫ్​ చేరిన జట్టు. చెన్నైని నాలుగు సార్లు టోర్నీ విజేతగా(2010,11,18,21) నిలిపాడు విజయవంతమైన కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ. 2020లో దారుణ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచినా.. మరుసటి ఏడాది ఘనంగా పుంజుకొని టైటిల్​ కొట్టడం చెన్నైకే చెల్లింది. అయితే.. ఈసారి మళ్లీ 2020ని పునరావృతం చేసేలా కనిపిస్తుంది. ఆడిన మూడింట్లో ఓడింది. ఈ సీజన్​కు రెండు రోజుల ముందు కెప్టెన్సీని జడేజాకు అప్పగించాడు ధోనీ. జడ్డూ అనుభవరాహిత్యానికి తోడు.. జట్టులో సమతూకం లోపించింది.

చెన్నై సూపర్​ కింగ్స్​

బ్యాటింగ్​లో గతేడాది ఆరెంజ్​ క్యాప్​ విన్నర్​ రుతురాజ్​ గైక్వాడ్​ వరుస వైఫల్యాలు చెన్నైని కలవరపెడుతోంది. గైక్వాడ్​తో కలిసి శుభారంభాలు అందించిన ఫాఫ్​ డుప్లెసిస్​ను వేలంలో బెంగళూరు దక్కించుకుంది. అంబటి రాయుడు, మొయిన్​ అలీ, జడేజా ఏమంత ఫామ్​లో లేరు. శివం దూబే, ధోనీనే కాస్తో కూస్తో బ్యాట్​ ఝులిపిస్తున్నారు. బౌలింగ్​లో మరీ తీసికట్టుగా కనిపిస్తోంది. డ్వేన్​ బ్రావో ఒక్కడే కాస్త పొదుపుగా బౌలింగ్​ చేస్తున్నాడు. పెద్దగా అనుభవం లేని ముకేశ్​ చౌదరి సహా జడ్డూ, జోర్డాన్​ కూడా భారీగా పరుగులు ఇస్తున్నాడు. ప్రిటోరియస్​ రాకతో కాస్త బలపడ్డట్లు కనిపించినా.. మిగతావారి నుంచి అతడికి సహకారం లభించట్లేదు.

చెన్నైకి మరో పెద్ద దెబ్బ ఏంటంటే.. దీపక్​ చాహర్​, శార్దుల్​ ఠాకుర్​ లేకపోవడం. కొన్నాళ్లుగా చెన్నై విజయాల్లో వీరిది ప్రధాన పాత్ర. చాహర్​ పవర్​ప్లేలో పొదుపుగా బౌలింగ్​ చేస్తూ వికెట్లు తీస్తుండేవాడు. కీలక సమయాల్లో శార్దుల్​ వికెట్లు తీసేవాడు. ఇద్దరూ బ్యాటింగ్​లోనూ మెరుపులు మెరిపించారు. ఈ మెగావేలంలో దీపక్​ చాహర్​ను రికార్డు స్థాయిలో రూ. 14 కోట్లకు దక్కించుకుంది చెన్నై. అయితే.. గాయంతో చాహర్​ దూరమయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్న అతడు.. త్వరలో సీఎస్​కే శిబిరంలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శార్దుల్​ ఠాకుర్​ను దిల్లీ దక్కించుకుంది. మరి.. చెన్నై ఈ జట్టుతో ఏమైనా అద్భుతాలు చేస్తుందో వేచిచూడాలి.

సన్​రైజర్స్​ హైదరాబాద్​: సన్​రైజర్స్​ హైదరాబాద్​ 2016లో కప్​ కొట్టింది. ఆ తర్వాత పలుమార్లు ప్లేఆఫ్స్​కు వెళ్లింది. గతేడాది చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆఖరున నిలిచింది. ఈసారి కూడా ఆడిన రెండింట్లో ఓడి చివర్లోనే ఉంది. దీంతో వేలంలో సరిగ్గా వ్యవహరించలేదని ఫ్రాంఛైజీపై మండిపడుతున్నారు సన్​రైజర్స్​ ఫ్యాన్స్​. ఈ జట్టు రెండు విభాగాల్లో తేలిపోతోంది. బ్యాటింగ్​లో డేవిడ్​ వార్నర్​ను వదులుకోవడం పెద్ద దెబ్బగా చెబుతున్నారు. విలియమ్సన్​ వంటి విజయవంతమైన కెప్టెన్​ ఉన్నప్పటికీ టీంలో సమతూకం లేదు. బ్యాటింగ్​ ఆర్డర్​లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఓపెనర్లుగా అభిషేక్​ వర్మ, విలియమ్సన్​ విఫలమవుతున్నారు. మార్​క్రమ్​, త్రిపాఠి మూడు, నాలుగో స్థానాల్లో అంతగా రాణించలేకపోతున్నారు. వెస్టిండీస్​ స్టార్లు నికోలస్​ పూరన్​, షెఫర్డ్​పై భారీగా ఆశలు పెట్టుకుంది యాజమాన్యం. వాషింగ్టన్​ సుందర్​ కాస్త దూకుడుగా ఆడుతున్నాడు. ఇతడిని బ్యాటింగ్​ ఆర్డర్​లో ముందు పంపించాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పటివరకు బ్యాటింగ్​లో పూరన్​, త్రిపాఠి, మార్​క్రమ్, సుందర్​ ఒక్కో మ్యాచ్​లోనే రాణించారు.

సన్​రైజర్స్​ హైదరాబాద్​

బౌలింగ్​లో భువనేశ్వర్​, నటరాజన్​, వాషింగ్టన్​ సుందర్​ కాస్త ఫర్వాలేదనిపిస్తున్నా.. వికెట్లు తీయలేకపోతున్నారు. ఉమ్రాన్​ మాలిక్​, షెఫర్డ్​ పరుగులు భారీగా సమర్పించుకుంటున్నారు. బ్యాటింగ్​ ఆర్డర్​లో మార్పులు చేసి.. బౌలర్లను సక్రమంగా వినియోగించుకుంటూ కేన్​ మామ సన్​రైజర్స్​ను గాడిన పెడతాడో లేదో చూడాలి.

రాజస్థాన్​ రాయల్స్​, పంజాబ్​ కింగ్స్​, లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ఒక్కో మ్యాచ్​ ఓడినా.. రెండు చొప్పున గెలిచాయి. కోల్​కతా నైట్​రైడర్స్​ ఒకటి ఓడి, 3 గెలిచి పాయింట్ల పట్టికలో టాప్​లో ఉంది. గుజరాత్​ టైటాన్స్​ ఆడిన రెండిట్లో గెలిచి మూడో స్థానంలో ఉంది. దిల్లీ క్యాపిటల్స్​ రెండు ఆడి ఒకటి గెలిచింది. ప్రస్తుతం ఏడో స్థానంలో కొనసాగుతోంది. ​

ఐపీఎల్​ పాయింట్ల పట్టిక

ఇవీ చూడండి: 'హైదరాబాద్​ అభిమానులు ఫుల్​ కుష్​'.. చెన్నైపై నెటిజన్ల సెటైర్లు!

ఇప్పటికీ.. ఎప్పటికీ.. ఆయనే నాకు స్ఫూర్తి: రోహిత్​

'పిచ్​ ఏదైనా.. సన్​రైజర్స్​ తలరాత అంతే': పాక్​ మాజీ క్రికెటర్​

ప్యాట్ కమిన్స్ విధ్వంస బ్యాటింగ్​.. ముంబయి హ్యాట్రిక్​ ఓటమి

Last Updated : Apr 7, 2022, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.