ETV Bharat / sports

'బేబీ ఏబీ' అరుదైన రికార్డు.. ఐపీఎల్​లో రెండో ప్లేయర్​గా..

Dewald Brevis Dismisses Kohli: ఐపీఎల్​ 2022 సీజన్​లో ముంబయి ఇండియన్స్​ ప్లేయర్​ బేబీ ఏబీ డెవాల్డ్​ బ్రెవిస్​ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్​ కెరీర్​లో తాను వేసిన తొలి బంతికే వికెట్​ తీశాడీ సౌతాఫ్రికా ఆటగాడు. ఇతడిని మెగా వేలంలో రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది ముంబయి ఇండియన్స్​

Baby AB Dewald Brevis dismisses Virat Kohli on his first IPL delivery

author img

By

Published : Apr 10, 2022, 3:21 PM IST

Dewald Brevis Dismisses Kohli: శనివారం రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ ఓడిపోయింది. 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఆర్సీబీ. తొలుత ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 151 పరుగులే చేసింది. స్వల్పలక్ష్యాన్ని సునాయాసంగా 3 వికెట్లు మాత్రమే ఛేదించింది ఆర్సీబీ. ఆ జట్టు హ్యాట్రిక్​ విజయాలు నమోదుచేయగా.. ముంబయి వరుసగా నాలుగో మ్యాచ్​ ఓడిపోయింది.

అయితే.. ఈ మ్యాచ్​లో ముంబయి ఆటగాడు, బేబీ ఏబీగా పిలుచుకునే డెవాల్డ్​ బ్రెవిస్​ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్​ కెరీర్​లో తాను వేసిన తొలి బంతికే వికెట్​ తీసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 19వ ఓవర్​లో బౌలింగ్​ వేసేందుకు వచ్చిన బ్రెవిస్​ తొలి బంతికే విరాట్​ కోహ్లీని ఎల్​బీడబ్ల్యూగా ఔట్​ చేశాడు. దీనిపై విరాట్​ రివ్యూకు వెళ్లినా.. ఫలితం ముంబయికి అనుకూలంగానే వచ్చింది. దీంతో కోహ్లీ పెవిలియన్​ చేరాల్సి వచ్చింది. ఐపీఎల్​లో తాను వేసిన తొలి బంతికే వికెట్​ తీసిన తొలి ప్లేయర్​గా ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్​ కీపర్​ బ్యాటర్​ ఆడమ్​ గిల్​క్రిస్ట్​ ఉన్నాడు. 2013 సీజన్​లో పంజాబ్​ కింగ్స్​కు ఆడిన గిల్లీ.. ముంబయి ఇండియన్స్​తో మ్యాచ్​లో ఆఖరి ఓవర్​ బౌలింగ్​ చేసి హర్భజన్​ను ఔట్​ చేశాడు. గిల్​క్రిస్ట్​ కెరీర్​లో తాను వేసిన తొలి, ఆఖరి బంతి ఇదే కావడం విశేషం.

ఇవీ చూడండి: తల్లి కూరగాయల విక్రేత.. 'గోల్స్​' వేటలో తనయ

ఆ నాలుగు దేశాలతో ప్రత్యేక టోర్నీ.. బీసీసీఐ​ ఏమందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.