ETV Bharat / sports

'హైదరాబాద్‌ అభిమానులకు కాలర్‌ ఎగరేసే టైమ్​ వచ్చేసింది' - ఎస్​ఆర్​హెచ్​ మీమ్స్​

IPL 2022: హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్‌ను సోమవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ చిత్తు చేసింది. గుజరాత్‌కు తొలి ఓటమిని రుచి చూపించిన హైదరాబాద్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌ అభిమానులు విజయోత్సవాలకు సిద్ధంగా ఉండాలని మీమ్స్‌ను షేర్‌ చేస్తున్నారు. మరి అలాంటి సరదా మీమ్స్‌, పోస్టులేంటో మీరూ ఓ సారి చూసేయండి..

Sunrisers hyderabad
కేన్​ విలియమ్సన్​
author img

By

Published : Apr 13, 2022, 7:21 AM IST

  • 'ఎవర్నీ తక్కువగా అంచనా వేయొద్దు'..
  • 'మే 29 వరకే మీరు హైదరాబాద్‌ ఆటగాళ్లు.. ఆ తర్వాత ఛాంపియన్స్'
  • 'తగ్గేదేలే'
  • 'హైదరాబాద్‌ అభిమానులు కాలర్‌ ఉన్న షర్టులు వేసుకోండమ్మా!.. ఎగరేసే టైమ్‌ వచ్చేసింది'
  • 'స్విగ్గీ ఫాస్టెస్ట్‌ బౌలర్‌ రివార్డును మ్యాచ్‌కు ముందే ఉమ్రాన్‌ కోసం పక్కన పెట్టేస్తే సరి.. మా టైమైనా సేవ్‌ అవుద్ది'
  • 'నా చేయి వీడవద్దు... నన్ను వదిలేసి పోవద్దు.. అంటూ చెన్నై, ముంబయి జట్ల మధ్య సరదా ముచ్చట్లు'

ఇవన్నీ ఏంటని అనుకుంటున్నారా... హైదరాబాద్ రెండో విజయం సాధించడం వల్ల నెట్టింట్లో అభిమానులు సరదా మీమ్స్‌తో చెలరేగుతున్నారు. టీ20 లీగ్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం వల్ల హైదరాబాద్‌ జట్టును చులకనగా చూసిన వారికి బుద్ధి చెప్పేలా అభిమానులు మీమ్స్‌ను రూపొందించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఇదే ఉత్సాహాన్ని టోర్నీ ఆసాంతం కొనసాగించి ఛాంపియన్లుగా నిలవాలని ఆకాంక్షిస్తున్నారు.

హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్‌ను సోమవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ చిత్తు చేసింది. దీంతో వరుసగా రెండో విజయంతో హైదరాబాద్‌ నాలుగు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ ఏడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం హైదరాబాద్‌ కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 19.1 ఓవర్లలో 168 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో గుజరాత్‌కు తొలి ఓటమిని రుచి చూపించిన హైదరాబాద్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌ అభిమానులు విజయోత్సవాలకు సిద్ధంగా ఉండాలని మీమ్స్‌ను షేర్‌ చేస్తున్నారు. మరి అలాంటి సరదా మీమ్స్‌, పోస్టులేంటో మీరూ ఓ సారి చూసేయండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.