ETV Bharat / sports

KL Rahul: కేఎల్​ రాహుల్ అరుదైన రికార్డు.. రోహిత్​తో సమంగా.. - ముంబయి ఇండియన్స్​

KL Rahul: ఐపీఎల్​లో తన జోరు కొనసాగిస్తున్నాడు లఖ్​నవూ సూపర్​జెయింట్స్​ కెప్టెన్ కేఎల్ రాహుల్. ఆదివారం ముంబయితో జరిగిన మ్యాచ్​లో అద్భుత శతకంతో జట్టుకు విజయాన్ని అందించిన అతడు.. అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక శతకాలు సాధించిన భారత క్రికెటర్లలో రోహిత్​ శర్మతో సమంగా నిలిచాడు.

IPL 2022
KL Rahul
author img

By

Published : Apr 25, 2022, 12:52 PM IST

KL Rahul: లఖ్​నవూ సూపర్​జెయింట్స్ సారథి కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్​లో ఒకే ప్రత్యర్థిపై మూడు సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్​గా ఘనత దక్కించుకున్నాడు. ఆదివారం ముంబయి ఇండియన్స్​పై చేసిన శతకంతో (103) ఈ ప్రత్యేకతను సంతరించుకున్నాడు.

ఈ సీజన్​లోనే ఏప్రిల్ 16న ముంబయిపై శతకం బాదిన రాహుల్.. మూడేళ్ల క్రితం వాంఖడే వేదికగా ఇదే జట్టుపై తన తొలి సెంచరీ నమోదు చేశాడు. టీ20ల్లో అత్యధిక శతకాలు సాధించిన భారత క్రికెటర్ల జాబితాలో రోహిత్​తో (6) సమంగా నిలిచాడు రాహుల్. వీరి తర్వాతి స్థానాల్లో కోహ్లీ (5), సురేశ్ రైనా (4) ఉన్నారు.

రాహుల్​కు భారీ జరిమానా: ఆదివారం ముంబయితో జరిగిన మ్యాచ్​లో స్లో ఓవర్​ రేట్​ కారణంగా రాహుల్​కు రూ.24 లక్షల భారీ జరిమానా పడింది. మిగిలిన ప్లేయర్లకు రూ.6 లక్షల వరకు విధించారు. ఈ సీజన్​లో రాహుల్​కు జరిమానా పడటం ఇది రెండోసారి. మరోసారి ఈ తప్పిదం జరిగితే అతడు జరిమానాతో పాటు ఓ మ్యాచ్​లో నిషేధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇవీ చూడండి:

రాతమారని ముంబయి.. ఎనిమిదో ఓటమితో టోర్నీ నుంచి ఔట్

చాలా బాధగా ఉంది.. అందరం బాధ్యతారాహిత్యంగా ఆడాం: రోహిత్

లఖ్​నవూ లవ్​బర్డ్స్.. అందరి కళ్లు వీరి వైపే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.