IPL 2022: శనివారం దిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో ఐపీఎల్ 2022లో తన ప్రస్థానాన్ని ముగించింది ముంబయి ఇండియన్స్. ఇది ఆ జట్టుకు నాలుగో విజయం కాగా, పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ముంబయి ప్లేఆఫ్స్‌కు చేరుకోకపోవడం ఇది వరుసగా రెండో ఏడాది. అయితే ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆ జట్టుకు ఈ ఏడాది అంతగా కలిసిరాకున్నా.. వ్యక్తిగత ప్రదర్శనల ఆధారంగా సంతోషించగలిగే ఓ విషయం ఉంది. ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓ అరుదైన రికార్డును సాధించాడు.
వరుసగా ఏడో సీజన్లో 15 లేదా అంతకన్నా ఎక్కువ వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు బుమ్రా. అతడి కన్నా ముందు కేవలం శ్రీలంక పేస్ ఐకాన్ లసిత్ మలింగ మాత్రమే ఈ ఘనత అందుకున్నాడు. దిల్లీతో మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. మొత్తంగా ఈ సీజన్లో 14 మ్యాచ్‌ల్లో 7.18 ఎకానమీతో 15 వికెట్లు తీశాడు. మరోవైపు డేనియల్ సామ్స్ కూడా 11 మ్యాచ్‌ల్లో 13 వికెట్లతో రాణించాడు.
ఇదీ చూడండి: ముంబయి విజయంతో ఆర్సీబీలో ఫుల్‌జోష్.. చిందులేస్తూ సంబరాలు