IPL 2022: రవీంద్ర జడేజా నుంచి జట్టు పగ్గాలను అందుకుని తొలి విజయం నమోదు చేసిన ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 202/2 స్కోరు చేయగా.. హైదరాబాద్ 189/6 స్కోరుకు పరిమితమై 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ క్రమంలో హైదరాబాద్, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు మీ కోసం..
Dhoni breaks Dravid record: రాహుల్ ద్రవిడ్ రికార్డును ధోనీ అధిగమించాడు. 2013లో రాజస్థాన్‌కు సారథిగా 40 ఏళ్ల 268 రోజుల వయసులో ద్రవిడ్ ముంబయిపై విజయం సాధించాడు. ఇప్పుడు ధోనీ 40 ఏళ్ల 298 రోజుల వయసులో హైదరాబాద్‌పై కెప్టెన్‌గా విజయం నమోదు చేశాడు.
- తొలి వికెట్‌కు రుతురాజ్ గైక్వాడ్ (99), డేవన్ కాన్వే (85) కలిసి 182 పరుగులను జోడించారు. ప్రస్తుత సీజన్‌లో ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. చెన్నైకి కూడా ఇదే హైయస్ట్ ఓపెనింగ్. అంతకుముందు 2020 సీజన్‌లో వాట్సన్-డుప్లెసిస్ (181) జోడించారు.
- ఒక్క పరుగు దూరంలో సెంచరీని మిస్ చేసుకున్న ఐదో బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (99). రుతురాజ్ కాకుండా విరాట్, పృథ్వీషా , ఇషాన్ కిషన్, క్రిస్ గేల్ ఉన్నారు. మరికొందరు బ్యాటర్లు 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఈ జాబితాలో ఎవరు ఉన్నారో తెలుసుకునేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
- వరుసగా ఐదు విజయాలను నమోదు చేసిన హైదరాబాద్ మరోసారి వరుసగా రెండో పరాజయం చవి చూసింది.
- అత్యంత వేగవంతమైన బౌలర్‌గా ఉమ్రాన్ మాలిక్ రికార్డు సృష్టించాడు. 154 కి.మీ వేగంతో బంతిని సంధించాడు. ఇదే వేగంతో రెండుసార్లు బంతిని విసరడం విశేషం.
ఇదీ చదవండి: 'కాస్త బుర్ర వాడు'.. బౌలర్‌పై ధోనీ ఫైర్.. ఏమైందంటే?