ETV Bharat / sports

IPL 2022: ఆ జట్టుకు మరో షాక్​.. కీలక ఆటగాడికి కరోనా

Delhi Capitals Covid 19: ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​ జట్టుకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే ఆ జట్టు ఫిజియో కరోనా బారిన పడగా, సోమవారం కీలక ఆటగాడికి కూడా పాజిటివ్​గా తేలింది. దీంతో పంజాబ్​తో మ్యాచ్​ కోసం సోమవారం పుణె వెళ్లాల్సిన ఆ జట్టు.. ప్రయాణాన్ని వాయిదా వేసుకుంది.

IPL 2022
delhi capitals covid news
author img

By

Published : Apr 18, 2022, 12:56 PM IST

Delhi Capitals Covid 19: దిల్లీ క్యాపిటల్స్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. జట్టులోని ఓ విదేశీ ఆటగాడికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. దీంతో బుధవారం పంజాబ్​ కింగ్స్​తో జరగాల్సిన తమ తదుపరి మ్యాచ్​ కోసం సోమవారం పుణె వెళ్లాల్సిన ఆ ఫ్రాంఛైజీ.. ప్రయాణాన్ని రద్దు చేసుకుంది.

కరోనా బారినపడిన ఆటగాడు.. ఆస్ట్రేలియా ఆల్​రౌండర్​ అని తెలుస్తోంది. అతడిలో కొన్ని లక్షణాలు కనపడటం వల్ల ర్యాపిడ్​ యాంటిజెన్ పరీక్షలు చేయగా, అందులో పాజిటివ్​గా తేలింది. దీంతో ఆటగాళ్లు సహా సహాయక సిబ్బంది తమ గదుల్లోనే ఉండాలని ఫ్రాంఛైజీ ఆదేశించింది. వారందరికీ ఆర్​టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇప్పటికే దిల్లీ ఫిజియో ప్యాట్రిక్ ఫార్హార్ట్​ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం అతడు క్వారంటైన్​లో ఉన్నాడు. కొవిడ్ సోకిన సమయంలో ప్యాట్రిక్‌ను కలిసిన, సన్నిహితంగా మెలిగిన ప్లేయర్లకు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారెవరికీ పాజిటివ్ రాలేదు.

ఇదీ చూడండి: IPL 2022: దిల్లీ క్యాపిటల్స్​లో కరోనా కలకలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.