ETV Bharat / sports

IPL 2022: బట్లర్​ మూడో సెంచరీ.. దిల్లీ ముందు భారీ లక్ష్యం

author img

By

Published : Apr 22, 2022, 9:27 PM IST

IPL 2022 DC vs RR: దిల్లీ క్యాపిటల్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో రెచ్చిపోయిన రాజస్థాన్​ రాయల్స్​ ఓపెనర్​ జోస్​ బట్లర్​ మూడో సెంచరీ నమోదు చేశాడు. దీంతో దిల్లీ ముందు 223 పరుగులు భారీ లక్ష్యాన్ని ఉంచింది ఆర్​ఆర్​.

IPL 2022 DC vs RR
జోస్​ బట్లర్​

IPL 2022 DC vs RR: ఐపీఎల్​ టీ20 మెగా లీగ్​ 15వ సీజన్​ రసవత్తరంగా సాగుతోంది. దిల్లీ క్యాపిటల్స్​తో ముంబయిలోని వాంఖడే మైదానంలో శుక్రవారం సాయంత్రం జరుగుతున్న మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​ ఓపెనర్లు విధ్వంసం సృష్టించారు. తొలి వికెట్​కు 155 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు భారీ స్కోర్​ సాధించేందుకు బాటలు వేశారు. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది ఆర్​ఆర్​. ఓపెనర్​​ జోస్​ బట్లర్​ మరోమారు సిక్సుల వర్షం కురిపించాడు. ఈ ఐపీఎల్​ సీజన్​లోనే మూడో సెంచరీ నమోదు చేశాడు. దీంతో దిల్లీ క్యాపిటల్స్​ ముందు 223 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది ఆర్​ఆర్​.

రాజస్థాన్​ రాయల్స్​ తరఫున 100వ మ్యాచ్​ ఆడుతున్న కెప్టెన్​ సంజూ శాంసన్​ సైతం వచ్చి రాగానే ఫోర్లు, సిక్సర్లతో స్కోరును పరుగులు పెట్టించాడు. ఖలీల్ అహ్మద్​ వేసిన 18వ ఓవర్​లో ఓ సిక్సర్​ బాదిన శాంసన్​ ఐపీఎల్​లో 5వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.

ఆర్​ఆర్​ బ్యాటర్లలో జోస్​ బట్లర్​ 65 బంతుల్లో 116 పరుగులు చేసి ఔట్​ అయ్యాడు.ఈ ఐపీఎల్​ సీజన్​లో అత్యధిక వ్యక్తిగత స్కోర్​ నమోదు చేశాడు బట్లర్​. దేవదత్​ పడిక్కల్​ 35 బంతుల్లో 7ఫోర్లు, రెండు సిక్సర్లతో 54 పరుగులు చేసి వెనుదిరిగాడు, కెప్టెన్​ సంజూ శాంసన్​ 19 బంతుల్లో 46 పరుగులు చేశాడు. దిల్లీ బౌలర్లలో కలీల్​ అహ్మద్ 4 ఓవర్లలో 47 పరుగులు ఇచ్చి ఒక వికెట్​ తీశాడు. ముస్తఫిజర్​ రెహ్మాన్​ 4 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి బట్లర్​ వికెట్​ పడగొట్టాడు.

ఇదీ చూడండి: ఐపీఎల్​లో మళ్లీ కరోనా కలవరం- ఐసోలేషన్​లోకి దిల్లీ హెడ్​కోచ్​ పాంటింగ్​

ఇర్ఫాన్ పఠాన్-​ అమిత్​ మిశ్రా ట్విట్టర్​ వార్​.. కారణమేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.