IPL 2022: దిల్లీ జట్టులో కరోనా కేసుల నేపథ్యంలో టీ20 లీగ్ మ్యాచ్ నిర్వహణపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. దిల్లీ, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించేందుకే బీసీసీఐ మొగ్గు చూపింది. టాస్ నెగ్గిన దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ బౌలింగ్ ఎంచుకుని పంజాబ్‌కి బ్యాటింగ్ అప్పగించాడు. ప్రస్తుతం దిల్లీ (4) ఐదు మ్యాచులకుగాను రెండు విజయాలు, మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. పంజాబ్ (6) మూడు విజయాలు, మూడు పరాజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతోంది.
జట్ల వివరాలు:
దిల్లీ: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషభ్ పంత్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, ముస్తాఫిజర్ రహ్మాన్, ఖలీల్ అహ్మద్
పంజాబ్: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, కగిసో రబాడ, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్
మరోవైపు, దిల్లీ, రాజస్థాన్ మధ్య ఏప్రిల్ 22న జరగాల్సిన మ్యాచ్‌ను పుణె నుంచి ముంబయిలోని వాంఖడే స్టేడియానికి తరలిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దిల్లీ జట్టులో కరోనా కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో.. టీమ్ సభ్యులకు ప్రయాణాలు తప్పేలా ఈ ఏర్పాట్లు చేసింది.
ఇదీ చదవండి: మరో దిల్లీ ఆటగాడికి కరోనా... పంజాబ్‌తో మ్యాచ్ డౌటే!