IPL 2022: చెన్నై సూపర్‌కింగ్స్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది గుజరాత్ టైటాన్స్. చెన్నై నిర్దేశించిన 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 3 కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (67) అర్ధశతకంతో రాణించాడు. గిల్ (18), మ్యాథ్యూ వేడ్ (20) ఫర్వాలేదనిపించారు. సీఎస్కే బౌలర్లలో మతీషా 2, మొయిన్ అలీ ఓ వికెట్ తీశారు.
అంతకుముందు గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చెన్నై బ్యాటర్లు దూకుడుగా ఆడలేకపోయారు. దీంతో గుజరాత్‌కు చెన్నై 134 పరుగులను మాత్రమే లక్ష్యంగా నిర్దేశించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (53) అర్ధశతకం సాధించాడు. జగదీశన్ (39*), మొయిన్ అలీ (21) ఫర్వాలేదనిపించారు. డేవన్ కాన్వే (5), శివమ్ దూబే (0), ఎంఎస్ ధోనీ (7) విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ 2.. రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, సాయికిశోర్ తలో వికెట్ తీశారు.
ఇదీ చూడండి: IPL 2022:ప్లేఆఫ్స్ ఛాన్స్ గోవిందా.. ఇక సన్‌రైజర్స్ ఇంటికే!