కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఓపెనర్‌గా అదరగొడుతున్న వెంకటేశ్ అయ్యర్ (venkatesh Iyer IPL) వచ్చే సీజన్ ఐపీఎల్ వేలంలో భారీ ధర పలుకుతాడని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. అతడు కనీసం రూ.12 నుంచి 14 కోట్ల వరకు ధర పలుకుతాడని అంచనా వేశాడు. యూఏఈలో ప్రారంభమైన రెండో దశలో కోల్‌కతా అనూహ్యంగా వెంకటేశ్‌కు (venkatesh Iyer IPL) అవకాశం ఇవ్వడం వల్ల రెండు చేతులా సద్వినియోగం చేసుకుంటున్నాడు. బ్యాట్‌తో పరుగుల వరద పారిస్తున్న అతడు అవసరమైతే బంతితోనూ మాయ చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అయ్యర్ (67) పరుగులతో రాణించాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడిన మంజ్రేకర్ రాబోయే సీజన్‌లో (IPL Mega Auction) వెంకటేశ్ భారీ ధర పలుకుతాడని, అందుకు కారణాలు కూడా ఉన్నాయని చెప్పాడు.
"వచ్చే ఐపీఎల్ వేలంలో వెంకటేశ్ రూ.12-14 కోట్ల ధర పలుకుతాడని అనుకుంటున్నా. ఇప్పుడతడు అనుకోకుండా బాగా ఆడుతున్నాడని కాదు.. అతడి దేశవాళీ గణాంకాలు చూశాను. ఫస్ట్‌క్లాస్, లిస్ట్-ఏ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 47 సగటుతో 92 స్ట్రైక్‌రేట్ కలిగి ఉన్నాడు. ఇది కేవలం దేశవాళీ టీ20 క్రికెట్ గణంకాలు మాత్రమే. ఇందులో ఐపీఎల్ కలపట్లేదు. వీటిని బట్టే అతడెలా ఆడతాడో తెలుస్తుంది. బ్యాటింగ్ ఎలా చేయాలో వెంకటేశ్‌కు బాగా తెలుసు. మరోవైపు అతడు బౌలర్‌గానూ పనికొస్తాడు. గత మ్యాచ్‌లో కీలక ఓవర్లు బౌలింగ్ చేసి ఆ సత్తా ఉందని నిరూపించుకున్నాడు. దీంతో రాబోయే వేలంలో (IPL Mega Auction) భారీ ధర పలుకుతాడనడంలో సందేహం లేదు. అతడు ఇదొక్క సీజన్‌లోనే కాకుండా చాలా కాలం గేమ్ ఛేంజర్‌గా కొనసాగుతాడు. తన ఫుట్‌వర్క్ బాగుంది. అన్ని రకాల షాట్లూ ఆడగలడు" అని మంజ్రేకర్ వివరించాడు.
ఇదీ చూడండి: వెంకటేశ్ అయ్యర్.. ఐపీఎల్ యువ సంచలనం!