దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ పేలవ ప్రదర్శన చేశారు. ప్రత్యర్థి బౌలర్ల దాడికి ఏ దిశలోనూ కోలుకోలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లలో కగిసొ రబాడ 3, అన్రిచ్ నోర్జే 2, అక్సర్ పటేల్ 2, వికెట్లు దక్కించుకున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌కు మంచి శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్లోనే వార్నర్(0) నోర్జే బౌలింగ్‌లో అక్సర్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రబాడ వేసిన 4.1 బంతిని సిక్స్‌గా మలిచిన మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (18).. అదే ఓవర్లో చివరి బంతికి ధావన్ చేతికి చిక్కాడు. ఈ క్రమంలోనే పవర్ ప్లే ముగిసే సరికి 32/2 స్కోరుతో నిలిచింది.
ఆ తర్వాత తొమ్మిది, పది ఓవర్లలో వరుసగా మూడు, నాలుగు వికెట్లను కోల్పోయింది హైదరాబాద్. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (18) అక్షర్ పటేల్ వేసిన 9.5వ బంతికి హెట్మేయర్ చేతికి చిక్కగా.. కగిసో రబాడ వేసిన 10.1 బంతికి మనీశ్ పాండే (17) ఔట్ అయ్యాడు.
అనంతరం అన్రిచ్ నోర్జే వేసిన 12.6 బంతికి కేదర్ జాదవ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జాసన్ హోల్డర్(10), అబ్దుల్ సమద్(28), రషీద్ ఖాన్(22), సందీప్ శర్మ(0), భువనేశ్వర్ కుమార్(5*) పరుగులు చేశారు. మొత్తంగా ప్రత్యర్థి జట్టుకు 135 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఇదీ చూడండి: IPL 2021: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్