అత్యధిక విజయాలతో దూసుకుపోయిన దిల్లీ క్యాపిటల్స్(DCvsSRH live scores) ఓ వైపు.. ఘోర పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ వైపు. ఐపీఎల్ 2021 రెండో దశలో(ipl second phase) భాగంగా ఈ రెండు జట్లు మరి కాసేపట్లో తలపడనున్నాయి. ముందుగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది.
పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ప్లే ఆఫ్స్ చేరుకోవాలంటే ఇప్పటినుంచి ఆడే ప్రతి మ్యాచులో గెలవాల్సిన పరిస్థితి. ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఆరు పరాజయాలు చవిచూసి అట్టడుగు స్థానంలో ఉన్న సన్‌రైజర్స్‌కు(delhi capitals vs sunrisers hyderabad) ఈ సీజన్‌లో ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టో అందుబాటులో లేకపోవడం భారీ లోటు. కాగా ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్న ఈ జట్టుకు నేడు మరో షాక్ తగిలింది. ఫాస్ట్‌బౌలర్ నటరాజన్‌కు(natarajan corona) కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. మరోవైపు అతని క్లోజ్ కాంటాక్ట్ అవ్వడం వల్ల ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. ఈ రెండు అంశాలూ హైదరాబాద్‌కు పెద్ద దెబ్బే.
జట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మనీశ్ పాండే, జేసన్ హోల్డర్, అబ్ధుల్ సమద్, కేదార్ జాదవ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్
దిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), మార్కస్ స్టొయినిస్, షిమ్రోన్ హెట్మేయర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, అన్రిచ్ నోర్జే, కగిసో రబాడ, అవేశ్ ఖాన్
ఇదీ చూడండి: IPL2021 News: జోరు మీద దిల్లీ.. కసితో సన్‌రైజర్స్!