ETV Bharat / sports

పంజాబ్​తో మ్యాచ్​.. సన్​రైజర్స్ పరువు నిలబెట్టుకుంటుందా?

సన్​రైజర్స్​ హైదరాబాద్​, పంజాబ్​ కింగ్స్(sunrisers vs punjab live score)​ మధ్య షార్జా వేదికగా మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు వేదికగా ఇరు జట్లు తలపడనున్నాయి.

ipl
ఐపీఎల్​
author img

By

Published : Sep 25, 2021, 9:04 AM IST

ఐపీఎల్​లో(ipl 2021 second phase) మరో ఆసక్తి పోరుకు రంగం సిద్ధమైంది. రెండో దశ తమ తొలి మ్యాచ్​లో విజయం వరకు వచ్చి ఓడిపోయిన పంజాబ్(sunrisers vs punjab match)​.. తొలి దశ నుంచి పేలవ ప్రదర్శన చేస్తున్న సన్​రైజర్స్​తో తలపడనుంది. శనివారం(సెప్టెంబరు 25) షార్జా వేదికగా ఈ మ్యాచ్​ జరగనుంది. ఇందులో గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని పంజాబ్​.. పరువు నిలబెట్టుకోవాలని సన్​రైజర్స్​ పట్టుదలతో ఉన్నాయి. పాయింట్ల పట్టికలో ఇరు జట్లు చివరి తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలపై ఓ లుక్కేద్దాం..

ఈ సారైనా

పంజాబ్​ కింగ్స్​.. తొలి దశ నుంచి ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచుల్లో ఆరింటిలో ఓడి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. రెండో దశను ఓటమితో ఆరంభించినా మంచి ప్రదర్శన చేసిందనే చెప్పాలి. రాజస్థాన్​తో మ్యాచ్​లో అదృష్టం కలిసి రాక రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. సారథి కేఎల్​ రాహుల్​, మయాంక్​ అగర్వాల్​, మర్​క్రమ్​, నికోలస్​ పూరన్​ బ్యాటింగ్​లో బాగా రాణించారు. బౌలర్లోనూ అర్షదీప్​ సింగ్​, షమి బాగా వికెట్లు తీశారు. ప్రస్తుతం జట్టు అన్ని విభాగాల్లోనూ బలంగానే ఉంది. టీమ్​ ఇదే ఫామ్​ను కొనసాగిస్తే విజయం సాధించడం పక్కా!

సన్​రైజర్స్​ తీరు మారుతుందా?

సన్​రైజర్స్ హైదరాబాద్​కు ఈ సారి యూఏఈ పిచ్​లు కలిసి రాలేదనే చెప్పాలి. తొలి దశ నుంచి పేలవమైన ప్రదర్శనతో అభిమానులకు తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క విజయం సాధించింది. రెండో దశను ఘోర ఓటమితో ఆరంభించింది. ఆడిన తొలి మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​(srh vs dc 2021)​ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయి ప్లేఆఫ్స్‌(sunrisers hyderabad playoffs) ఆశలు గల్లంతు చేసుకుంది! ఒకవేళ ఇప్పుడైనా ప్లేఆఫ్స్‌ చేరాలనే ఆశలు ఉంటే ఇకపై మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. అది కూడా ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. టాప్​ ఆర్డర్​లో రాణిస్తారనుకున్నవార్నర్‌, కెప్టెన్‌ విలియమ్సన్‌, మనీశ్‌ పాండే తక్కువ స్కోరుకే పరిమితమవుతున్నారు. బెయిల్​ స్టో లేకపోవడం పెద్ద లోటు. మిడిలార్డర్​లో ఘోరంగా విఫలమవుతుంది. బౌలర్లో రషీద్‌ ఖాన్‌ మినహా మిగతా వారు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. కాబట్టి పంజాబ్​తో జరిగే మ్యాచ్​లో కూడా గెలుస్తుందనే నమ్మకం లేదు. ఈ మ్యాచ్​లోనైనా ఆటగాళ్లు సమిష్టిగా రాణించి, అదృష్టం తోడుంటే విజయం దక్కుతుంది. లేదంటే మళ్లీ కథ కంచికే.

అయితే హైదరాబాద్​పై పంజాబ్​కు చెత్త రికార్డు ఉంది. ఇరు జట్లు 17మ్యాచ్​లు ఆడగా.. అందులో హైదరాబాద్​ 12 గెలవగా.. పంజాబ్​ ఐదు మాత్రమే గెలిచింది.

ఇదీ చూడండి: సన్​రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరి!. కారణాలివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.