బయో బబుల్‌లో ఉంటూ ఐపీఎల్ ఆడుతున్న క్రికెటర్లు.. అప్పుడప్పుడు డ్యాన్స్‌లు చేస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా తమిళ హీరో విజయ్ నటించిన 'మాస్టర్' సినిమాలోని 'వాతి కమింగ్' పాటకు దేశ, విదేశీ ఆటగాళ్లు చిందులేస్తున్నారు. దిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు కూడా ఇప్పుడు ఈ సాంగ్‌కు స్టెప్పులేశారు. ఈ వీడియోను డీసీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ముందుగా క్రిస్ వోక్స్ వాతి కమింగ్ పాటకు చిందులేయగా.. ఆ తర్వాత అశ్విన్, స్టీవ్ స్మిత్, అజింక్య రహానె, శిఖర్ ధావన్, రిషభ్ పంత్ ఒక్కొక్కరుగా వారి వారి తరహాలో స్టెప్పులేశారు. తర్వాత అందరూ కలిసి డ్యాన్స్లేశారు.
-
You wanted @SDhawan25 and @ashwinravi99's version of #VaathiComing, we got @RishabhPant17, @stevesmith49, @ajinkyarahane88 and @chriswoakes to join them too 💙🕺🏼
— Delhi Capitals (@DelhiCapitals) April 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
P.S. Don't blame us if you play this on loop all night 🔁😉#YehHaiNayiDilli #IPL2021 @TheJSWGroup @TajMahalMumbai pic.twitter.com/pPOymxcBiI
">You wanted @SDhawan25 and @ashwinravi99's version of #VaathiComing, we got @RishabhPant17, @stevesmith49, @ajinkyarahane88 and @chriswoakes to join them too 💙🕺🏼
— Delhi Capitals (@DelhiCapitals) April 12, 2021
P.S. Don't blame us if you play this on loop all night 🔁😉#YehHaiNayiDilli #IPL2021 @TheJSWGroup @TajMahalMumbai pic.twitter.com/pPOymxcBiIYou wanted @SDhawan25 and @ashwinravi99's version of #VaathiComing, we got @RishabhPant17, @stevesmith49, @ajinkyarahane88 and @chriswoakes to join them too 💙🕺🏼
— Delhi Capitals (@DelhiCapitals) April 12, 2021
P.S. Don't blame us if you play this on loop all night 🔁😉#YehHaiNayiDilli #IPL2021 @TheJSWGroup @TajMahalMumbai pic.twitter.com/pPOymxcBiI
గత సీజన్లో దిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్జే వంటి కీలక ఆటగాళ్లు దూరమైనప్పటికీ దిల్లీ ఈసారి తమ తొలి మ్యాచ్‌లో గెలుపొందింది. చెన్నై జట్టుపై 189 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.
ఇదీ చదవండి: 'వాతి కమింగ్'కు చిందులేసిన సన్‌రైజర్స్ ఆటగాళ్లు
ఇదీ చదవండి: తెవాతియా అద్భుత క్యాచ్.. పరాగ్ చిత్రమైన బంతి
స్మిత్ ఇంత తక్కువకెలా?
స్టీవ్ స్మిత్‌ను కేవలం రూ.2.2 కోట్లకు దక్కించుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు దిల్లీ కోచ్ రికీ పాంటింగ్. "ఇంత తక్కువ మొత్తానికి ఎలా దక్కించుకున్నామో అర్థం కావట్లేదు. గతేడాది రాజస్థాన్‌కు ఆడిన స్మిత్‌ను ఈ ఏడాది ఆ ఫ్రాంఛైజీ వదిలేసింది. ఇలా చాలా మందిని చాలా జట్లు వదిలేశాయి. అయినా వారు గత ధర కంటే కాస్త అటుఇటుగా మినీ వేలంలో అమ్ముడయ్యారు. చాలా ఫ్రాంఛైజీల దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ, స్మిత్ కోసం ఎవరూ పోటీపడలేదు. ఇది ఆశ్చర్యంగా అనిపించింది" అని పాంటింగ్ తెలిపాడు.
ఇప్పటికే హెట్మయర్, స్టాయినిస్, క్రిస్ వోక్స్, టామ్ కరన్.. నలుగురు విదేశీ ప్లేయర్లు తుది జట్టులో ఉన్నారు. దీంతో టీమ్‌లో స్థానం కోసం స్మిత్ ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ అతడు బరిలోకి దిగితే కనుక టాప్-3లో బ్యాటింగ్‌కు వస్తాడని పాంటింగ్ స్పష్టం చేశాడు. దిల్లీ తమ తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 15న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.
ఇదీ చదవండి: నమ్మకం కోల్పోలేదు.. మ్యాచ్‌పై మాటల్లేవ్..
ఇదీ చదవండి: 'వాతి కమింగ్'కు పంచెకట్టులో రైనా చిందులు