ETV Bharat / sports

ఐపీఎల్ 2021.. ఈ రికార్డులు చెదిరిపోయాయి! - ఐపీఎల్ 2021 వార్నర్ రికార్డు

దాదాపు నెలపాటు అభిమానుల్ని ఉర్రూతలూగించింది ఐపీఎల్. కానీ కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. ఈ కాస్త సమయంలోనే అదిరిపోయే బ్యాటింగ్, కళ్లుచెదిరే బౌలింగ్​తో ఆటగాళ్లు వినోదాన్ని పంచారు. ఈ క్రమంలో పలు రికార్డులూ నమోదు చేశారు. అవేంటో చూద్దాం.

IPL 2021
ఐపీఎల్ 2021
author img

By

Published : May 5, 2021, 6:38 PM IST

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల్ని నిరాశకు గురిచేస్తూ ఐపీఎల్ 14వ సీజన్ వాయిదాపడింది. దేశంలో కరోనా విజృంభించడం, బయోబబుల్​లోని ఆటగాళ్లకు వైరస్ సోకడం, ఆటగాళ్ల రక్షణ వంటి కారణాలతో ఈ సీజన్​ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. సీజన్​లో 60 మ్యాచ్​లు ఆడాల్సి ఉండగా ఇప్పటివరకు 29 మ్యాచ్​లు పూర్తయ్యాయి. ఈ కాస్త సమయంలోనే కొందరు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రికార్డులూ తిరగరాశారు. ఈ క్రమంలో ఇప్పటివరకు పూర్తయిన సీజన్​లో ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం.

  • 36 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో ఓ ఓవర్లో 36 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు చెన్నై సూపర్ కింగ్స్ ఆల్​రౌండర్ జడేజా. హర్షల్ పటేల్ వేసిన ఓవర్లో ఈ ఘనత సాధించాడు. ఓ ఓవర్లో 36 పరుగులు సాధించిన రెండో ఆటగాడు జడ్డూ.
  • 119 - ఈ సీజన్​లో రాజస్థాన్ రాయల్స్​కు కెప్టెన్​గా బాధ్యతలు నిర్వర్తించాడు యువ బ్యాట్స్​మన్ సంజూ శాంసన్. పంజాబ్ కింగ్స్​తో జరిగిన తొలి మ్యాచ్​లో సెంచరీ (119)తో కదం తొక్కాడు. తద్వారా కెప్టెన్​గా అరంగేట్రంలోనే సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
    kohli
    కోహ్లీ
  • 4 - ఈ సీజన్​ పంజాబ్ కింగ్స్ బ్యాట్స్​మన్ నికోలస్ పూరన్​కు పీడకలగా మారింది. ఆడిన 7 మ్యాచ్​ల్లో నాలుగుసార్లు డకౌట్​గా వెనుదిరిగాడు. తద్వారా ఓ ఐపీఎల్ సీజన్​లో ఎక్కువసార్లు సున్నా పరుగులకే ఔటైన రెండో బ్యాట్స్​మన్​గా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.
  • 5000 - గతేడాది ఫామ్​ను తిరిగి కొనసాగిస్తూ ఈ సీజన్​లోనూ దుమ్ముదులిపాడు దిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్​మన్ శిఖర్ ధావన్. ఈ క్రమంలోనే లీగ్​లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. అలాగే ఐపీఎల్​లో 5 వేల పరుగుల పూర్తి చేసిన తొలి ఓపెనర్​గానూ రికార్డు సృష్టించాడు.
    dhawan
    ధావన్
  • 2 - సన్​రైజర్స్-దిల్లీ మధ్య జరిగిన మ్యాచ్​ సూపర్ ఓవర్​కు దారితీసింది. అయితే ఇందులో దిల్లీ అక్షర్ పటేల్​తో, సన్​రైజర్స్ రషీద్​ ఖాన్​తో బౌలింగ్ చేయించాయి. ఇలా ఓ సూపర్​ ఓవర్లో ఇద్దరు స్పిన్నర్లు బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి.
    warner
    వార్నర్
  • 1 - ముంబయి ఇండియన్స్​తో జరిగిన ఐపీఎల్ తొలి మ్యాచ్​లో ఐదు వికెట్లతో సత్తాచాటాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్. తద్వారా ముంబయిపై ఐదు వికెట్లు సాధించిన తొలి బౌలర్​గా రికార్డు సృష్టించాడు.
    prithwi shah
    పృథ్వీ షా
  • 200 - ఈ సీజన్​ ద్వారా ఆర్సీబీ, దిల్లీ ఐపీఎల్​లో 200 మ్యాచ్​లు పూర్తి చేసుకున్న రెండు, మూడో జట్లుగా ఘనత వహించాయి. ఇప్పటికే ముంబయి మైలురాయికి చేరుకుంది.
  • 4000 - ఈ సీజన్​ ద్వారా టీ20 కెప్టెన్​గా 4000 పరుగులు పూర్తి చేసుకున్నాడు ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ. ఈ ఘనత వహించిన నాలుగో ఆటగాడు హిట్​మ్యాన్.
    rohit
    రోహిత్
  • 200 - ఈ సీజన్​ ద్వారా ఐపీఎల్​లో 200 సిక్సులను పూర్తి చేసుకున్నారు సురేశ్ రైనా, పొలార్డ్, డేవిడ్ వార్నర్. అయితే క్రిస్ గేల్ మాత్రం 350 సిక్సులు బాది ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.
    dhoni
    ధోనీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.