ETV Bharat / sports

Rohit Sharma IPL: రోహిత్ శర్మ తర్వాత మ్యాచ్​లో ఉంటాడా? - కలకత్తా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్

చెన్నై సూపర్​కింగ్స్​తో(CSK Vs MI 2021) మ్యాచ్​లో రోహిత్​ శర్మ ఆడకపోవడంపై ముంబయి ఇండియన్స్​ ఫ్యాన్స్​ నిరాశ చెందారు. ఇదే విషయమై ముంబయి కోచ్​ మహేలా జయవర్ధనే స్పష్టత ఇచ్చాడు. కోల్​కతాతో తర్వాత జరిగే మ్యాచ్​లో అతడు ఆడతాడని తెలిపాడు.

IPL 2021: Rohit needs extra few days, he'll be fine to play against KKR, says Jayawardene
IPL 2021: కోల్​కతాతో మ్యాచ్​లో హిట్​మ్యాన్​ అందుబాటులో ఉంటాడా?
author img

By

Published : Sep 20, 2021, 10:30 AM IST

చెన్నై​తో ఆదివారం మ్యాచ్​లో ముంబయి​(CSK Vs MI 2021) ఓడిపోయింది. దుబాయ్​లో జరిగిన ఈ మ్యాచ్​లో(IPL 2021) కెప్టెన్ రోహిత్​ శర్మ, ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య అందుబాటులో లేరు. అయితే తర్వాతి మ్యాచ్​కు రోహిత్ అందుబాటులోకి వస్తాడని ఆ జట్టు కోచ్ మహేలా జయవర్ధనే స్పష్టం చేశాడు.

"యూకే నుంచి తిరిగి వచ్చిన తర్వాత రోహిత్​ శర్మ సాధన చేస్తూనే ఉన్నాడు. అయినా అతడికి కొన్ని రోజులు విశ్రాంతిని ఇస్తే బాగుంటుందని భావించాం. తర్వాతి మ్యాచ్​లో రోహిత్​ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. హార్దిక్​ పాండ్య ప్రస్తుతం ప్రాక్టీసులో ఉన్నాడు. కాబట్టి అతడికి మరికొన్నాళ్లు విశ్రాంతినివ్వాలని అనుకుంటున్నాం"

- మహేలా జయవర్ధనే, ముంబయి ఇండియన్స్​ కోచ్​

ఐపీఎల్‌-14(IPL 2021) రెండో అంచెలో చెన్నై(CSK vs MI) శుభారంభం చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (88 నాటౌట్‌; 58 బంతుల్లో 9×4, 4×6) మెరవడం వల్ల(Ruturaj Gaikwad IPL Innings) ఆదివారం జరిగిన మ్యాచ్​లో 20 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్‌ను ఓడించింది. జడేజా(26), డ్వేన్‌ బ్రావో (23) సహకారంతో రుతురాజ్‌ పోరాడడం వల్ల మొదట చెన్నై 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. ఛేదనలో ముంబయి 8 వికెట్లకు 136 పరుగులే చేయగలిగింది. బ్రావో (3/25), దీపక్‌ చాహర్‌ (2/19) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆ జట్టుకు కళ్లెం వేశారు. సౌరభ్‌ తివారి(50 నాటౌట్‌) పోరాడినా ఫలితం లేకపోయింది.

ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్​ జట్టు తమ తర్వాతి మ్యాచ్​ను కోల్​కతా నైట్​రైడర్స్​తో(MI Vs KKR 2021) గురువారం ఆడనుంది.

ఇదీ చూడండి.. IPL 2021: కోల్​కతాతో ఆర్​సీబీ పోరు.. ట్రోఫీ రేసులో నిలిచేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.