ETV Bharat / sports

'అతడో గొప్ప ఫినిషర్​.. భవిష్యత్​లో గుర్తుండిపోతాడు' - ధోనీ పాంటింగ్

దిల్లీ క్యాపిటల్స్(dc vs csk 2021)​తో జరిగిన మ్యాచ్​లో అద్భుత విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. ఆఖర్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టుకు విజయాన్నందించాడు ధోనీ (ms dhoni ipl). ఈ నేపథ్యంలో అతడి ఆటతీరుపై ప్రశంసల జల్లు కురిస్తున్నారు పలువురు మాజీలు.

Ponting
పాంటింగ్
author img

By

Published : Oct 11, 2021, 4:26 PM IST

సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ(ms dhoni ipl) తిరిగి ఫామ్‌లోకి రావడంపై దిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ స్పందించాడు. మ్యాచ్‌(dc vs csk 2021) అనంతరం ఆసీస్‌ మాజీ సారథి మాట్లాడుతూ.. ధోనీ ఐపీఎల్‌(ipl 2021 news) నుంచి రిటైర్‌ అయ్యాక గొప్ప ఆటగాడిగా గుర్తుండిపోతాడని కొనియాడాడు. చివర్లో చెన్నై సారథిని నిలువరించలేకపోయామని చెప్పాడు. తమ బౌలర్లు సరైన ప్రదేశాల్లో బంతులు వేయలేక మూల్యం చెల్లించుకున్నారన్నాడు.

"రుతురాజ్‌(70) ఔటయ్యాక జడేజా వస్తాడా, ధోనీ(ms dhoni ipl) వస్తాడా అని డగౌట్‌లో మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అప్పుడు ధోనీ వస్తాడని అనుకొని మా ఆటగాళ్లకు జాగ్రత్తగా బౌponలింగ్‌ చేయమని సైగలు చేశా. చివరికి మేం అనుకున్న రీతిలో అతడిని కట్టడిచేయలేకపోయాం. ధోనీ(ms dhoni ipl)ని వదిలేస్తే మూల్యం చెల్లించుకునేలా చేస్తాడని తెలుసు. అతడు చాలా ఏళ్లుగా అదే పని చేస్తున్నాడు. ఈసారి మా బౌలర్లు అతడిని కట్టడి చేయడానికి అవసరమైన ప్రదేశాల్లో బంతులు సంధించలేకపోయారు. అతడు రిటైర్‌ అయ్యాక క్రికెట్‌లో ఒక గొప్ప ఫినిషర్‌గా ఎప్పటికీ గుర్తుండిపోతాడు" అని పాంటింగ్‌(ponting ipl) కొనియాడాడు.

మరోవైపు ధోనీ(ms dhoni ipl) ఆటచూసి దిగ్గజ ఆటగాడు, టీమ్‌ఇండియా మాజీ సారథి సునీల్‌ గావస్కర్‌(gavaskar comment on dhoni) కూడా మురిసిపోయాడు. మహీ అవసరమైన వేళ బాధ్యత తీసుకుని ముందుండి నడిపించాడని మెచ్చుకున్నాడు. ‘జడేజా బాగా ఆడుతున్నా ఈసారి ధోనీనే ముందు బ్యాటింగ్‌కు వచ్చాడు. తను బాధ్యత తీసుకొని కెప్టెన్‌గా గెలిపించాలనుకున్నాడు. ఇది నిజంగా చాలా మంచి విషయం. అవసరమైన వేళ బరిలోకి దిగి స్టైలిష్‌గా పని పూర్తి చేశాడు. ఈ ఫ్రాంఛైజీ గతేడాది మినహా ప్రతిసారీ మెరిసింది. 2020లో ఒక్కసారే దారి తప్పింది. ఇప్పుడా జట్టు ఎలా ఆడుతుందో చూడండి. అదిరిపోయే ప్రదర్శనతో తిరిగొచ్చింది. ఆటగాళ్ల భావోద్వేగాలు చూడండి. అలాగే అభిమానులు కూడా చెన్నై సూపర్‌ కింగ్స్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు" అని గావస్కర్‌(gavaskar comment on dhoni) అభిప్రాయపడ్డాడు.

ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ మాట్లాడుతూ ధోనీ(ms dhoni ipl) బ్యాటింగ్‌కు వచ్చేముందు టెక్నికల్‌ అంశాలపై చాలా విషయాలు చర్చించినట్లు చెప్పాడు. ఒక సారథిగా వెళ్లి ధోనీ మ్యాచ్‌ను పూర్తి చేస్తాడనే నమ్మకాన్ని తాను అడ్డుకోలేదని తెలిపాడు. ధోనీ(ms dhoni ipl) ఈ మ్యాచ్‌లో అంత ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని, దాని ఫలితం చూశామన్నాడు. ఇక చివర్లో అతడు బౌండరీ బాది మ్యాచ్‌ను గెలిపించిన వెంటనే ఆటగాళ్లంతా భావోద్వేగం చెందరన్నాడు. ధోనీ(ms dhoni ipl) బరిలోకి దిగే ప్రతిసారి బాగా ఆడాలనే తాము ఆశిస్తామని చెప్పాడు. అతడిపై భారీ అంచనాలు ఉంటాయని, ఈ క్రమంలోనే ఇప్పుడు విజయంతో ముగించాడని ఫ్లెమింగ్‌ ప్రశంసించాడు.

ఇవీ చూడండి: ఆ పరిస్థితుల నుంచి బయటపడాలనుకున్నా: ధోనీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.