టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. జేసన్ రాయ్ (44), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (31) పరుగులతో రాణించారు. ఓపెనర్ అభిషేక్ శర్మ (13) దూకుడుగా ఆడే క్రమంలో.. జార్జ్ గార్టన్ బౌలింగ్‌లో మాక్స్‌వెల్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు.
మిగిలిన బ్యాట్స్‌మెన్ ప్రియమ్ గార్గ్ (15), వృద్ధిమాన్ సాహా (10), జేసన్ హోల్డర్ (16) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. అబ్దుల్ సమద్(1) కూడా విఫలమయ్యాడు. ఆఖర్లో వచ్చిన రషీద్ ఖాన్(7) ఆకట్టుకోలేకపోయాడు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు, డేనియల్ క్రిస్టియన్ రెండు, జార్జ్ గార్టన్, యుజువేంద్ర చాహల్ తలో వికెట్ తీశారు.
ఇదీ చూడండి.. RCB Vs SRH: టాస్ గెలిచిన ఆర్సీబీ.. హైదరాబాద్ బ్యాటింగ్