ETV Bharat / sports

RCB Vs MI: బెంగళూరు విజయానికి టర్నింగ్​ పాయింట్​ అదే! - Maxwell IPL News

ముంబయి ఇండియన్స్‌(RCB Vs MI) ప్లే ఆఫ్స్‌ అవకాశాలు మరింత సంక్లిష్టం. ఐపీఎల్​ రెండో దశలో(IPL 2021) పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ ఆ జట్టు ఆరో పరాజయాన్ని చవిచూసింది. అద్భుత బౌలింగ్​తో ముంబయికి కళ్లెం వేసిన బెంగళూరు ఆరో విజయంతో ప్లే ఆఫ్స్(IPL Playoffs 2021)​ రేసులో ముందంజ వేసింది. హర్షల్​ పటేల్​ హ్యాట్రిక్​తో(Harshal Patel Hat Trick) మెరవగా.. మ్యాక్స్​వెల్​(Maxwell IPL News) ఆల్​రౌండ్​ సత్తా చాటి బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

IPL 2021, RCB vs MI highlights: Harshal Patel hat-trick helps RCB beat MI
RCB Vs MI: బెంగళూరు విజయానికి టర్నింగ్​ పాయింట్​ అదే!
author img

By

Published : Sep 27, 2021, 6:45 AM IST

మ్యాక్స్‌వెల్‌(Maxwell IPL News) ఆల్‌రౌండ్‌ సత్తా చాటడం వల్ల ఆదివారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 54 పరుగుల తేడాతో ముంబయిని(RCB Vs MI) చిత్తు చేసింది. మ్యాక్స్‌వెల్‌(56), కోహ్లీ (51) మెరవడం వల్ల మొదట బెంగళూరు 6 వికెట్లకు 165 పరుగులు సాధించింది. హర్షల్‌ పటేల్‌ (4/17), మ్యాక్స్‌వెల్‌ (2/23), చాహల్‌ (3/11) విజృంభించడం వల్ల ఛేదనలో ముంబయి 18.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. రోహిత్‌ (43) ఒక్కడే రాణించాడు. హర్షల్‌ పటేల్‌ హ్యాట్రిక్‌(Harshal Patel Hat Trick) సాధించడం విశేషం. బెంగళూరు ఆరో విజయంతో ప్లేఆఫ్స్‌(IPL Playoffs 2021) అవకాశాలను ఇంకా మెరుగుపర్చుకుంది.

ముంబయి విలవిల..

రోహిత్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో ఛేదనను ముంబయి ఘనంగానే ఆరంభించింది. డికాక్‌ (24) వికెట్‌ను కోల్పోయి 9 ఓవర్లలో 75/1తో సాఫీగా లక్ష్యం దిశగా సాగింది. కానీ పదో ఓవర్లో మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రోహిత్‌ ఔట్‌ కావడం వల్ల మ్యాచ్‌ మలుపు తిరిగింది. అక్కడి నుంచి ముంబయి ఇన్నింగ్స్‌ గతి తప్పింది. బెంగళూరు కట్టుదిట్టమైన బౌలింగ్‌కు ఇషాన్‌ కిషన్‌(9), కృనాల్‌(5), సూర్యకుమార్‌ యాదవ్‌(8) చకచకా పెవిలియన్‌ చేరడం వల్ల ముంబయి 15 ఓవర్లలో 99/5తో ఒత్తిడిలో పడింది.

చివరి అయిదు ఓవర్లలో ముంబయి 67 పరుగులు చేయాల్సిన పరిస్థితి. అయినా పొలార్డ్‌, హార్దిక్‌ క్రీజులోనే ఉండగా.. ముంబయిలో ఆశలు మిగిలే ఉన్నాయి. కానీ చాలా వేగంగా ఆ ఆశలకు తెరపడింది. 17వ ఓవర్లో హర్షల్‌ వరుస బంతుల్లో హార్దిక్‌(3), పొలార్డ్‌(7), రాహుల్‌ చాహర్‌(0)ను ఔట్‌ చేసి హ్యాట్రిక్‌ సాధించడం ద్వారా బెంగళూరుకు విజయాన్ని ఖాయం చేశాడు.

మెరిసిన మ్యాక్స్‌వెల్‌, కోహ్లీ

మొదట బెంగళూరు అనుకున్నదానికంటే తక్కువ స్కోరే చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు.. రెండో ఓవర్లోనే పడిక్కల్‌(0)ను కోల్పోయినా కోహ్లీ నిలబడడం వల్ల గట్టి పునాదినే వేసుకుంది. చక్కని షాట్లు ఆడిన కెప్టెన్​ కోహ్లీ.. ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన శ్రీకర్‌ భరత్‌(32)తో కలిసి రెండో వికెట్‌కు 68 పరుగులు జోడించాడు. 9వ ఓవర్లో భరత్‌ ఔటయ్యేటప్పటికి జట్టు స్కోరు 75. ఆ తర్వాత కోహ్లీ ధాటిగా ఆడకున్నా మ్యాక్స్‌వెల్‌ దూకుడు ప్రదర్శించాడు.

స్విచ్‌ హిట్లతో రెండు కళ్లు చెదిరే సిక్స్‌లు కొట్టాడు 16వ ఓవర్లో కోహ్లీ నిష్క్రమించేటప్పటికి స్కోరు 126. డివిలియర్స్‌(11), మ్యాక్స్‌వెల్‌ బ్యాట్‌ ఝుళిపించడం వల్ల తర్వాతి రెండు ఓవర్లలో 30 పరుగులు రాబట్టిన బెంగళూరు 156/3తో మంచి స్కోరే చేసేలా కనిపించింది. కానీ చివరి రెండు ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన బుమ్రా, బౌల్ట్‌.. కేవలం 9 పరుగులకే 3 వికెట్లు పడగొట్టి బెంగళూరు భారీ స్కోరు ఆశలపై నీళ్లు చల్లారు.

తొలి బ్యాట్స్​మన్​గా కోహ్లీ

టీ20ల్లో 10 వేల పరుగులు మైలురాయిని అందుకున్న తొలి భారత బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.

బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లీ (సి) రాయ్‌ (బి) మిల్నె 51; పడిక్కల్‌ (సి) డికాక్‌ (బి) బుమ్రా 0; శ్రీకర్‌ భరత్‌ (సి) సూర్యకుమార్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 32; మ్యాక్స్‌వెల్‌ (సి) బౌల్ట్‌ (బి) బుమ్రా 56; డివిలియర్స్‌ (సి) డికాక్‌ (బి) బుమ్రా 11; క్రిస్టియన్‌ నాటౌట్‌ 1; షాబాజ్‌ అహ్మద్‌ (బి) బౌల్ట్‌ 1; జేమీసన్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 165;

వికెట్ల పతనం: 1-7, 2-75, 3-126, 4-161, 5-161, 6-162;

బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-17-1; బుమ్రా 4-0-36-3; మిల్నె 4-0-48-1; కృనాల్‌ 4-0-27-0; రాహుల్‌ చాహర్‌ 4-0-33-1.

ముంబయి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) పడిక్కల్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 43; డికాక్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) చాహల్‌ 24; ఇషాన్‌ కిషన్‌ (సి) హర్షల్‌ (బి) చాహల్‌ 9; సూర్యకుమార్‌ (సి) చాహల్‌ (బి) సిరాజ్‌ 8; కృనాల్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 5; పొలార్డ్‌ (బి) హర్షల్‌ 7; హార్దిక్‌ (సి) కోహ్లి (బి) హర్షల్‌ 3; మిల్నె (బి) హర్షల్‌ 0; రాహుల్‌ చాహర్‌ ఎల్బీ (బి) హర్షల్‌ 0; బుమ్రా (బి) చాహల్‌ 5; బౌల్ట్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (18.1 ఓవర్లలో ఆలౌట్‌) 111;

వికెట్ల పతనం: 1-57, 2-79, 3-81, 4-93, 5-97, 6-106, 7-106, 8-106, 9-111;

బౌలింగ్‌: జేమీసన్‌ 2-0-22-0; సిరాజ్‌ 3-0-15-1; క్రిస్టియన్‌ 2-0-21-0; హర్షల్‌ పటేల్‌ 3.1-0-17-4; చాహల్‌ 4-1-11-3; మ్యాక్స్‌వెల్‌ 4-0-23-2.

ఇదీ చూడండి.. IPL 2021: ముంబయి ఇండియన్స్​పై ఆర్సీబీ విజయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.