ETV Bharat / sports

RCB Vs DC: ఉత్కంఠగా సాగిన మ్యాచ్​లో బెంగళూరుదే విజయం - రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు

రెండు దేశాల్లో రెండు దశల్లో అత్యంత సుదీర్ఘంగా సాగిన ఐపీఎల్‌-14 లీగ్‌ దశకు తెరపడింది. చివరి రోజు ఫలితాలతో ప్లేఆఫ్స్‌ బెర్తుల్లో మార్పులేమీ జరిగిపోలేదు. ముందు రోజు టాప్‌-4 స్థానాల్లో ఉన్న జట్లు అలాగే ముందంజ వేశాయి. చివరి ప్లేఆఫ్‌ బెర్తు కోల్‌కతాకే సొంతమైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ కథ ముగిసింది. ఇక లీగ్‌ దశ చివరి రోజు హీరో మాత్రం కేఎస్‌ భరతే. ఈ సీజన్లో బెంగళూరు తరఫున అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని గొప్పగా ఉపయోగించుకుంటున్న ఈ తెలుగు కుర్రాడు.. దిల్లీపై సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. బెంగళూరుకు ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో.. చివరి బంతికి సిక్సర్‌ బాది జట్టుకు అనూహ్య విజయాన్నందించాడు.

IPL 2021, RCB Vs DC
బెంగళూరు వర్సెస్​ ఢిల్లీ
author img

By

Published : Oct 8, 2021, 11:12 PM IST

Updated : Oct 9, 2021, 11:47 AM IST

మ్యాచ్‌లో ఆఖరి బంతి.. గెలవాలంటే సిక్స్‌ కొట్టాలి. సినిమాల్లో హీరో అయితే చాలా అవలీలగా సిక్స్‌ బాదేస్తాడేమో.. కానీ అలాంటి ఉత్కంఠభరిత క్షణాల్లో సిక్స్‌ కొట్టడం అంత సులభమేం కాదు. తేలికైన ప్రత్యర్థి ఎదురుగా ఉన్నా.. అనుభవం ఎంత ఉన్నా ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి జట్టును గెలిపించడం అంటే మాటలు కాదు. అలాంటిది ఈ సీజన్‌లో అత్యధిక విజయాలతో అగ్రస్థానంలో ఉన్న దిల్లీ క్యాపిటల్స్‌ లాంటి బలమైన జట్టుపై ఆ ఫీట్‌ చేయడమంటే అద్భుతమే. ఆ అద్భుతాన్ని అందుకుని ఔరా అనిపించాడు తెలుగు కుర్రాడు కేఎస్‌ భరత్‌.. దిల్లీతో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఆద్యంతం ఆకట్టుకున్న ఈ యువ హీరో అదిరే బ్యాటింగ్‌తో బెంగళూరుకు విజయాన్ని కట్టబెట్టాడు. ఆఖరి బంతి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌ని ఓడించింది. మొదట దిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. పృథ్వీ షా (48; 31 బంతుల్లో 4×4, 2×6), శిఖర్‌ ధావన్‌ (43; 35 బంతుల్లో 3×4, 2×6) రాణించారు. ఛేదనలో శ్రీకర్‌ భరత్‌ (78 నాటౌట్‌; 52 బంతుల్లో 3×4, 4×6), మ్యాక్స్‌వెల్‌ (51 నాటౌట్; 33 బంతుల్లో 8×4) చెలరేగడంతో లక్ష్యాన్ని బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

వాళ్లిద్దరూ నిలబడి..: ఛేదనలో ఆరంభం నుంచి బెంగళూరు తడబడింది. రెండో ఓవర్లోనే దేవ్‌దత్‌ పడిక్కల్‌ (0) వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత ఆ జట్టుకు మరో షాక్‌ తగిలింది. ఈసారి కెప్టెన్‌ కోహ్లి (4) వెనుదిరిగాడు. ఈ రెండు వికెట్లు నార్జ్‌ ఖాతాలో చేరాయి. వికెట్లు పడినా.. శ్రీకర్‌ భరత్‌ ఎదురుదాడి చేశాడు. అక్షర్‌ బౌలింగ్‌లో వరుసగా సిక్స్‌, ఫోర్‌ బాది స్కోరు పెంచాడు. అతడి భాగస్వామి డివిలియర్స్‌ (26; 26 బంతుల్లో 2×4, 1×6) కూడా కుదురుకోవడంతో 9 ఓవర్లకు బెంగళూరు 54/2తో కోలుకున్నట్లే కనిపించింది. కానీ డివిలియర్స్‌ను ఔట్‌ చేసిన అక్షర్‌.. బెంగళూరును దెబ్బ కొట్టాడు. మ్యాక్స్‌వెల్‌తో కలిసి ఎదురుదాడి చేసిన భరత్‌.. బెంగళూరును మరీ వెనకబడకుండా చూశాడు. చక్కటి షాట్‌లతో అలరించాడు. ఈ క్రమంలో 37 బంతుల్లోనే అతడు అర్ధసెంచరీ మార్కు అందుకున్నాడు. సమీకరణం 24 బంతుల్లో 46 పరుగులుగా ఉన్న స్థితిలో మ్యాక్స్‌వెల్‌, భరత్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో బెంగళూరు (12 బంతుల్లో 19) లక్ష్యానికి చేరువగా వచ్చింది.

ఆఖర్లో ఉత్కంఠ: కానీ 19వ ఓవర్లో 4 పరుగులే రావడంతో ఆఖరి ఓవర్లో ఆర్‌సీబీ 15 పరుగులు చేయాల్సి వచ్చింది. అవేష్‌ ఖాన్‌ వేసిన ఆ ఓవర్లో తొలి బంతికి మ్యాక్స్‌వెల్‌ ఫోర్‌ కొట్టడంతో ఆర్‌సీబీ శిబిరంలో ఆశలు రేగినా.. ఆ తర్వాత 4 బంతులకు 5 పరుగులే రావడంతో బెంగళూరు నెగ్గాలంటే చివరి బంతికి సిక్స్‌ కొట్టాల్సి వచ్చింది. అయితే ఆరో బంతిని అవేష్‌ వైడ్‌ వేయడంతో సమీకరణం 1 బంతికి 5 పరుగులుగా మారింది. అయితే కొంచెం ఎత్తులో వచ్చిన ఫుల్‌ టాస్‌ను భరత్‌.. బౌలర్‌ తల మీదుగా సిక్స్‌గా కొట్టి బెంగళూరుకు సంచలన విజయాన్ని అందించాడు.

ఆరంభం అదిరినా..: అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీకి ఆ జట్టు ఓపెనర్లు మెరుపు ఆరంభం ఇచ్చారు. పృథ్వీషా, శిఖర్‌ ధావన్‌ పోటాపోటీగా షాట్లు ఆడడంతో స్కోరు పరుగులెత్తింది. పవర్‌ ప్లే ఆఖరికి ఆ జట్టు 55/0తో బలమైన స్థితిలో నిలిచింది. అదే జోరులో హర్షల్‌ బౌలింగ్‌లో ధావన్‌.. చాహల్‌ బౌలింగ్‌లో పృథ్వీ చెరో సిక్స్‌ అందుకుని స్కోరుకు మరింత వేగాన్ని ఇచ్చారు. 10 ఓవర్లకు 88/0తో నిలిచింది దిల్లీ. పృథ్వీ, ధావన్‌ అర్ధసెంచరీలకు చేరువయ్యారు. ఈ స్థితిలో ఆ జట్టుకు షాక్‌ తగిలింది. కుదురుకున్న ధావన్‌, పృథ్వీతో పాటు కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ (10) మూడు ఓవర్ల తేడాతో పెవిలియన్‌ చేరారు. ఈ స్థితిలో హెట్‌మయర్‌ (29; 22 బంతుల్లో 2×4, 2×6) ధాటిగా ఆడి.. శ్రేయస్‌ (18)తో కలిసి నాలుగో వికెట్‌కు 35 పరుగులు జత చేశాడు. శ్రేయస్‌ వెనుదిరిగినా ధాటిని కొనసాగించిన అతడు ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి ఔటయ్యాడు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్‌ (2/25), క్రిస్టియన్‌ (1/19), హర్షల్‌ పటేల్‌ (1/34), చాహల్‌ (1/34) ప్రత్యర్థిని కట్టడి చేశారు.

దిల్లీ ఇన్నింగ్స్‌: పృథ్వీ (సి) గార్టన్‌ (బి) చాహల్‌ 48; ధావన్‌ (సి) క్రిస్టియన్‌ (బి) హర్షల్‌ 43; పంత్‌ (సి) భరత్‌ (బి) క్రిస్టియన్‌ 10; శ్రేయస్‌ (సి) క్రిస్టియన్‌ (బి) సిరాజ్‌ 18; హెట్‌మయర్‌ (సి) కోహ్లి (బి) సిరాజ్‌ 29; రిపల్‌ పటేల్‌ నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 164

వికెట్ల పతనం: 1-88, 2-101, 3-108, 4-143, 5-164

బౌలింగ్‌: మ్యాక్స్‌వెల్‌ 3-0-29-0; సిరాజ్‌ 4-0-25-2; గార్టన్‌ 3-0-20-0; చాహల్‌ 4-0-34-1; హర్షల్‌ పటేల్‌ 4-0-34-1; క్రిస్టియన్‌ 2-0-19-1

బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) రబాడ (బి) నార్జ్‌ 4; పడిక్కల్‌ (సి) అశ్విన్‌ (బి) నార్జ్‌ 0; శ్రీకర్‌ భరత్‌ నాటౌట్‌ 78; డివిలియర్స్‌ (సి) శ్రేయస్‌ (బి) అక్షర్‌ పటేల్‌ 26; మ్యాక్స్‌వెల్‌ నాటౌట్‌ 51; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 166

వికెట్ల పతనం: 1-3, 2-6, 3-55

బౌలింగ్‌: నార్జ్‌ 4-0-24-2; అవేష్‌ఖాన్‌ 4-0-31-0; అక్షర్‌ పటేల్‌ 4-0-39-1; రబాడ 4-0-37-0; అశ్విన్‌ 1-0-11-0; రిపల్‌ పటేల్‌ 3-0-22-0

Last Updated : Oct 9, 2021, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.