ETV Bharat / sports

ఐపీఎల్​ నియమావళిని ఉల్లంఘించిన దినేశ్​ కార్తిక్​ - ఐపీఎల్ క్వాలిఫయర్స్​ 2

కోల్​కతా నైట్​రైడర్స్​ బ్యాట్స్​మన్​ దినేశ్ కార్తిక్​ను(Dinesh Karthik News) ఐపీఎల్​ నిర్వాహకులు మందలించారు. దిల్లీ క్యాపిటల్స్​తో(DC Vs KKR) జరిగిన క్వాలిఫయర్స్​-2 మ్యాచ్​లో ఐపీఎల్​ నియమావళిని దినేశ్​ కార్తిక్​ ఉల్లంఘించడమే అందుకు కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 'ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్ కండక్ట్‌'(IPL Code of Conduct) కింద తప్పు చేసినట్లు దినేశ్​ కార్తిక్​ అంగీకరించాడని నిర్వహకులు తెలిపారు.

IPL 2021 Qualifier-2: Dinesh Karthik Reprimanded For Breaching IPL Code of Conduct
ఐపీఎల్​ నియమావళిని ఉల్లంఘించిన దినేశ్​ కార్తిక్​
author img

By

Published : Oct 14, 2021, 3:25 PM IST

కోల్‌కతా నైట్​రైడర్స్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తిక్‌(Dinesh Karthik News) మందలింపునకు గురయ్యాడు. అతడు ఐపీఎల్‌ నియమావళి ఉల్లంఘించాడని పేర్కొంటూ టోర్నీ నిర్వహకులు బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే, అందులో అతడేం చేశాడనే విషయం మాత్రం వెల్లడించలేదు. గతరాత్రి దిల్లీ క్యాపిటల్స్‌తో(DC Vs KKR) క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో తలపడిన సందర్భంగా కార్తిక్‌(0) ఛేదనలో డకౌటైనప్పుడు తన కోపాన్ని వికెట్లపై చూపించాడని సమాచారం. ఈ నేపథ్యంలోనే 'ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్ కండక్ట్‌'(IPL Code of Conduct) కింద తప్పు చేసినట్లు అంగీకరించాడని నిర్వహకులు తెలిపారు. అతడిపై మ్యాచ్‌ రిఫరీ తీసుకునే చర్యలు అంతిమం అని అందులో పేర్కొన్నారు.

ఈ మ్యాచ్‌లో దిల్లీ నిర్దేశించిన 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా మొదట తెలిగ్గా ఛేదించేలా కనిపించింది. 16 ఓవర్లకు 123/2 స్కోర్‌తో నిలిచి విజయానికి 13 పరుగుల దూరంలో నిలిచింది. అయితే, ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అప్పటికి శుభ్‌మన్‌ గిల్‌(45), రాహుల్‌ త్రిపాఠి క్రీజులో ఉన్నారు. ఇక తర్వాత అవేశ్‌ఖాన్‌, రబాడ, నార్జె తర్వాతి మూడు ఓవర్లు కట్టుదిట్టంగా బంతులేసి 6 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశారు. గిల్(46), కార్తిక్‌(0), మోర్గాన్‌(0) ఔటయ్యారు. చివరి ఓవర్‌లో షకిబ్‌(0), నరైన్‌(0) కూడా పెవిలియన్‌ చేరడం వల్ల ఆఖరి రెండు బంతుల్లో కోల్‌కతా విజయానికి 6 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలోనే ఐదో బంతిని రాహుల్‌ త్రిపాఠి(12) స్టాండ్స్‌లోకి తరలించి మ్యాచ్‌ను గెలిపించాడు. ఈ క్రమంలోనే కార్తిక్‌ ఔటైనప్పుడు వికెట్లను తీసి పారేశాడు.

ఇదీ చూడండి.. 'టీ20 ప్రపంచకప్​లో ఫినిషర్​గా హార్దిక్..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.