అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో జేమీసన్ 2, చాహల్, షాబాజ్, డేనియల్ సామ్స్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టుకు అంతా మంచి ఆరంభమేమీ లభించలేదు. ఓపెనింగ్ జంట తొలి వికెట్‌కు 19 పరుగులు జోడించాక.. ప్రభుమన్సింగ్ రూపంలో మొదటి వికెట్ కోల్పోయింది రాహుల్ సేన. వన్‌డౌన్‌లో క్రిస్ గేల్.. అప్పటికే క్రీజులో ఉన్న సారథి కేఎల్ రాహుల్ (57 బంతుల్లో 91 పరుగులు)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రెండో వికెట్‌కు ఈ ద్వయం 80 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. 24 బంతుల్లోనే 46 పరుగులు చేసి ఊపుమీదున్న గేల్‌ను.. సామ్స్ పెవిలియన్ పంపాడు. 98-1తో పటిష్ట స్థితిలో నిలిచిన పంజాబ్.. కొద్ది పరుగుల తేడాతో 4 వికెట్లను కోల్పోయి.. 118/5కి మారింది.
ఇదీ చదవండి: డబ్ల్యూబీసీ ఛాంపియన్షిప్ పోటీలు వాయిదా
అనంతరం క్రీజులోకి వచ్చిన హర్‌ప్రీత్ బ్రార్(17 బంతుల్లో 25 పరుగులు).. రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. ఇక అతనికి రాహుల్ కూడా జత కలిశాడు. దీంతో ఈ జంట ఆరో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
ఇదీ చదవండి: 'భారత్‌లోనే టీ20 ప్రపంచ కప్.. వేదికలు నాలుగే!'