ఐపీఎల్ రెండో దశలో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మన్ అదరగొట్టారు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో ఆలౌట్ అయి 185 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 5, మహ్మద్ షమీ 3, హర్‌ప్రీత్ బ్రార్, ఇషాన్ పొరెల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు మంచి శుభారంభం దక్కింది. ఓపెనర్లుగా దిగిన ఎవిన్ లివీస్(36; 7x4, 6x1), యశస్వి జైస్వాల్(49) అదరగొట్టారు. తొలి వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. దూకుడుగా ఆడుతున్న ఎవిన్ లూయిస్.. అర్ష్‌దీప్ సింగ్ వేసిన బంతికి మయాంక్ అగర్వాల్‌కు చిక్కాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్(4) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ఇషాన్ పొరెల్ వేసిన ఎనిమిదో ఓవర్లో తొలి బంతికి రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన లియామ్ లివింగ్‌స్టోన్(25) అర్షదీప్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఇక నిలకడగా ఆడుతూ వచ్చిన యశస్వి జైస్వాల్‌ను హర్‌ప్రీత్ బ్రార్ అడ్డుకోవడం వల్ల నాలుగో వికెట్ కోల్పోయింది రాజస్థాన్.
ఆ తర్వాత క్రీజులోకి మహిపాల్(43; 6x4,4x2) ధనాధన్ బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. ఈ క్రమంలోనే ఐదో వికెట్‌గా రియాన్ పరాగ్(4) మహమ్మద్ షమి వేసిన 16 ఓవర్ 3వ బంతికి మార్‌క్రమ్ చేతికి చిక్కాడు. 18వ ఓవర్లో రాహుల్ తెవాతియా(2), క్రిస్ మోరిస్(5) వరుసగా ఏడు, ఎనిమిది వికెట్లుగా వెనుదిరిగాడు. చివర్లో వచ్చిన చేతన్ సకారియా(7), కార్తిక్ త్యాగీ(1) నామమాత్రంగా ఆడారు. ముస్తాఫిజుర్ రెహ్మన్ నాటౌట్‌గా నిలిచాడు. మొత్తంగా పంబాబ్ ముందు 186 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఇదీ చూడండి: IPL 2021: టాస్ గెలిచిన పంజాబ్..రాజస్థాన్ బ్యాటింగ్