ఐపీఎల్ 2021(IPl 2021 News)లో భాగంగా నేడు (సెప్టెంబర్ 27) మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవడానికి రాజస్థాన్ రాయల్స్, గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (rr vs srh 2021) అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముందుగా ఈ మ్యాచ్‌లో టాస్(rr vs srh toss) గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
బ్యాటింగ్ మెరుగుపడేనా?
9 మ్యాచుల్లో 8 పాయింట్లతో పట్టికలో 7వ స్థానంలో ఉంది రాజస్థాన్ (Rajasthan Royals). ఐపీఎల్ రెండో దశలో పంజాబ్‌పై నెగ్గిన సంజూ సేన.. దిల్లీతో శనివారం మ్యాచ్‌లో ఓటమిపాలైంది. రెండు మ్యాచ్‌ల్లోనూ బౌలింగ్ విభాగం మెరుగైన ప్రదర్శన చేసింది. కానీ, దిల్లీ మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ సంజూ శాంసన్ మినహా ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ రాణించలేదు.
గెలుపు బాట పట్టేనా?
సన్‌రైజర్స్ (Sunrisers Hyderabad).. ఈ టోర్నీలో అత్యంత పేలవమైన ప్రదర్శన చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ సహా ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమవుతుండగా.. బౌలింగ్‌లో ఆశలన్నీ రషీద్ ఖాన్పైనే ఉన్నాయి. రాజస్థాన్‌కు పేస్ త్రయం ముస్తాఫిజుర్ రెహ్మాన్, కార్తిక్ త్యాగి, చేతన్ సకారియా బలంగా కనిపిస్తున్నారు.
జట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్
జాసన్ రాయ్, సాహా, విలియమ్సన్ (కెప్టెన్), ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్, సిద్ధార్థ్ కౌల్, సందీప్ శర్మ
రాజస్థాన్ రాయల్స్
ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్), లివింగ్‌స్టోన్, మహిపాల్ లోమ్రోర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, మోరిస్, సకారియా, ఉనద్కత్, ముస్తాఫిజుర్