ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2021) చరిత్రలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్(Mumbai Indians Captain) రోహిత్ శర్మ పేరిట అనేక రికార్డులు ఉన్నాయి. ఐదు సార్లు ట్రోఫీని(Rohit Sharma IPL Titles) సాధించిన సారథిగా నిలిచిన ఏకైక ఐపీఎల్ చరిత్రలో నిలిచాడు. అయితే హిట్‌మ్యాన్ పేరిట ఘనతలతో పాటు పలు చెత్త రికార్డులూ ఉన్నాయి. వాటి సంగతి ఇప్పుడు చూసేద్దాం.
హిట్‌మ్యాన్ పేరిట అరుదైన రికార్డు..
- ఐపీఎల్ 2011 సీజన్లో ముంబయి ఇండియన్స్ జట్టులో భాగమైన రోహిత్ శర్మ.. తన నాయకత్వంలో ఏకంగా ఐదుసార్లు విజేతగా నిలిపాడు. ఇప్పటివరకు ఏ టీమ్ ఐదు సార్లు ట్రోఫీని గెలిచింది లేదు. అయితే ఇది హిట్‌మ్యాన్ కెరీర్లోనే కాకుండా.. ఐపీఎల్ చరిత్రలో చెక్కు చెదరని రికార్డు.
- ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు రోహిత్ శర్మ. ఐపీఎల్ కెరీర్లో 207 మ్యాచ్‌ల్లో 130 స్ట్రైక్‌రేట్‌తో 5480 పరుగులు(Rohit Sharma Runs In IPL) చేశాడు. అందులో ఒక సెంచరీ, 40 హాఫ్సెంచరీలున్నాయి.
- ఐపీఎల్ లీగ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్(224)గా రోహిత్ ఘనత సాధించాడు.
టీ20 క్రికెట్లో 400 సిక్సర్లు(Rohit Sharma T20 Sixes) కొట్టిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచేందుకు రోహిత్ శర్మకు అవసరమైన సిక్సర్లు 3. ప్రస్తుతం అతని ఖాతాలో 397 సిక్సర్లున్నాయి.
చెత్త రికార్డు..
ఐపీఎల్లో అత్యధిక ట్రోఫీలు నెగ్గిన కెప్టెన్ రోహిత్ శర్మ.. అత్యధిక సార్లు డకౌట్(Rohit Sharma IPL Ducks) అయిన బ్యాట్స్‌మన్‌గానూ చెత్తరికార్డు నమోదు చేశారు. లీగ్‌లో ఏకంగా 13 సార్లు డకౌట్ అయ్యాడు. ఇందులో మరో నలుగురు బ్యాట్స్‌మెన్ భాగమయ్యారు. వారిలో హర్భజన్ సింగ్, పార్ధివ్ పటేల్, రహానె, అంబటి రాయుడు ఉన్నారు. మనీష్ పాండే(12), గ్లెన్ మ్యాక్స్‌వెల్(11), శిఖర్ ధావన్(11), రషీద్ ఖాన్(9), ఏబీ డివిలియర్స్(9), సంజూ శాంసన్(8), క్రిస్ గేల్(8), సురేశ్ రైనా(8) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఐపీఎల్ రెండోదశ ఆదివారం(సెప్టెంబరు 19) నుంచి ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో ముంబయి ఇండియన్స్(CSK Vs MI 2021) తలపడనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 3 సిక్సర్లు సాధిస్తే.. టీ20ల్లో 400 సిక్సర్లు బాదిన తొలి బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ రికార్డు సాధిస్తాడు.
ఇదీ చూడండి.. IPL 2021: ఐపీఎల్లో ప్రేక్షకులు.. కానీ వారికి నో ఎంట్రీ!