ఐపీఎల్ 2021లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవడమే లక్ష్యంగా నేడు (సెప్టెంబర్ 29) రాజస్థాన్ రాయల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది.
ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. టాప్-4 రేసులో ఆర్సీబీ కాస్త ముందుండగా.. రాజస్థాన్ ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిన పరిస్థితి.
ఫేస్ టూ ఫేస్
ఇప్పటివరకు ఈ రెండు జట్లు 23 మ్యాచ్‌ల్లో తలపడగా ఆర్సీబీ 11, రాజస్థాన్ 10 మ్యాచ్‌ల్లో గెలిచాయి.
జట్లు
రాజస్థాన్ రాయల్స్
ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్), లివింగ్‌స్టోన్, మహిపాల్ లోమ్రోర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, మోరిస్, కార్తీక్ త్యాగి, సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
కోహ్లీ (కెప్టెన్), పడిక్కల్, కేఎస్ భరత్, మ్యాక్స్‌వెల్, డివిలియర్స్, డేనియర్ క్రిస్టియన్, జార్జ్ గార్డన్, షాబాద్ అహ్మద్, హర్షల్ పటేల్, సిరాజ్, చాహల్