తుదిదశకు చేరుకుంటున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPl 2021 News) అభిమానుల్లో రోజురోజుకూ ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే మూడు జట్లు ప్లేఆఫ్స్(ipl playoffs 2021) బెర్తును ఖరారు చేసుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్-3 జట్లుగా ఉన్నాయి. ఇక చివరి స్థానం కోసం నాలుగు జట్లు పోటీపడుతున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌కు ఈ ఆఖరి బెర్తు దక్కించుకునే వీలుంది. ఇందులో నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉన్న కేకేఆర్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలపై ఓ లుక్కేద్దాం.
కోల్‌కతా నైట్‌రైడర్స్
తర్వాతి మ్యాచ్: అక్టోబర్ 7- రాజస్థాన్ రాయల్స్‌తో పోటీ
ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లే ఆఫ్స్ రేసు(kolkata knight riders playoff chances)లో మరింత ముందుకెళ్లింది. అక్టోబర్ 7న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో కేకేఆర్ గెలిస్తే వారి ప్లేఆఫ్స్ బెర్తు ఖరారవుతుంది. ఈ జట్టు కనుక భారీ తేడాతో రాజస్థాన్‌ను ఓడిస్తే మిగిలిన జట్లతో సంబంధం లేకుండా ఈ జట్టు ముందంజ వేస్తుంది.
పంజాబ్ కింగ్స్
తర్వాతి మ్యాచ్: అక్టోబర్ 7-చెన్నై సూపర్ కింగ్స్‌తో పోరు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమిపాలైన పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ అవకాశాల్ని గల్లంతు చేసుకుంది. ఇక వీరు ప్లే ఆఫ్స్(punjab kings playoff chances) చేరడం మిగత ఫ్రాంచైజీల గెలుపోటములపై ఆధారపడి ఉంది. అక్టోబర్ 7న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో వీరు గెలిచినా 14 పాయింట్లకు చేరుకోలేరు. కానీ చెన్నైపై ఈ జట్టు భారీ తేడాతో గెలిచి కేకేఆర్.. రాజస్థాన్‌పై ఓడిపోయి, మంబయి.. రాజస్థాన్‌ను ఓడిస్తే ఈ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగవుతాయి. ముంబయి, రాజస్థాన్ వారి మ్యాచ్‌ల్లో భారీ తేడాతో ఓడిపోతేనే ఇది సాధ్యమవుతుంది. మొత్తానికి పంజాబ్ టాప్-4లో నిలవాలంటే అద్భుతం జరగాలని చెప్పొచ్చు.
రాజస్థాన్ రాయల్స్
తర్వాతి మ్యాచ్‌లు: అక్టోబర్ 5- ముంబయ ఇండియన్స్
అక్టోబర్ 7 - కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పోరు
రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్(rajasthan royals playoff chances) అవకాశాలు వారి చేతుల్లోనే ఉన్నాయి. వారు కనుక మిగిలిన చివరి రెండు మ్యాచ్‌ల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబయి ఇండియన్స్‌ను ఓడిస్తే నెట్‌రన్‌రేట్‌తో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తారు. ఈ జట్టు అక్టోబర్ 5న ముంబయితో, 7న కోల్‌కతాతో తలపడనుంది.
ముంబయి ఇండియన్స్
తర్వాతి మ్యాచ్‌లు: అక్టోబర్ 5 - రాజస్థాన్ రాయల్స్
అక్టోబర్ 8 - సన్‌రైజర్స్ హైదరాబాద్
ప్లే ఆఫ్స్(mumbai indians next match) రేసులో పోటీపడుతున్న మిగిలిన జట్లతో పోలిస్తే ముంబయి ఇండియన్స్ నెట్రేట్ (-0.453) మైనస్‌లో ఉంది. ఈ జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో అక్టోబర్ 5న, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో 8న తలపడనుంది. వీరు టాప్-4కి వెళ్లాలంటే ఈ రెండు జట్లపై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ కేకేఆర్ తమ తర్వాతి మ్యాచ్‌లో గెలిస్తే ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపు గల్లంతనే చెప్పాలి.