ETV Bharat / sports

ఐపీఎల్​ 2021: అత్యధిక వికెట్లు పడగొట్టిన వీరులు! - పీయూష్ చావ్లా ఐపీఎల్ వికెట్లు

టీ20 ఫార్మాట్ అంటే బ్యాట్స్​మెన్​కు పండగే. కానీ కొందరు బౌలర్లూ వారి ప్రతిభతో జట్టుకు విజయాలనందించారు. ఐపీఎల్ అందుకు మినహాయింపు కాదు. చాలా సందర్భాల్లో బౌలర్లు బ్యాట్స్​మెన్​పై ఆధిపత్యం వహించిన నేపథ్యాలు ఉన్నాయి. మరికొద్ది గంటల్లో ఐపీఎల్​ ప్రారంభకానున్న నేపథ్యంలో లీగ్​లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లు ఎవరో తెలుసుకుందాం.

bowlers with most wickets in IPL history
ఐపీఎల్​లో అత్యధిక వికెట్లు పడగొట్టిన వీరులు!
author img

By

Published : Apr 9, 2021, 6:22 PM IST

ఐపీఎల్ 14వ సీజన్​ మరికొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. కరోనా కారణంగా గతేడాది యూఏఈలో జరిగిన లీగ్​ను ఈసారి స్వదేశంలోనే నిర్వహించనున్నారు. అయితే పొట్టి ఫార్మాట్​ను బ్యాట్స్​మెన్ గేమ్​గా అభిప్రాయపడతారు. కానీ కొందరు బౌలర్లూ తమ జట్లకు విజయాలనందించిన సందర్భాలు ఉన్నాయి. ఐపీఎల్​లోనూ ఇలా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ లీగ్​లో ఆధిపత్యం వహించి అత్యధిక వికెట్లు సాధించిన టాప్-5 బౌలర్లు ఎవరో చూద్దాం.

లసిత్ మలింగ

bowlers with most wickets in IPL history
లసిత్​ మలింగ

ఐపీఎల్ చరిత్రలో గొప్ప బౌలర్​గా పేరు సంపాందించాడు ముంబయి ఇండియన్స్ పేసర్ లసిత్ మలింగ. 122 మ్యాచ్​లు ఆడి 170 వికెట్లతో రికార్డు సృష్టించాడు. ఇందులో 108 వికెట్లు డెత్ ఓవర్లలో సాధించినవే. ఎకానమీ 7.14గా ఉంది. 2009లో ముంబయి ఫ్రాంఛైజీ ఇతడిని కొనుగోలు చేయగా 2019 వరకు ఆ జట్టుకే ఆడాడు. 2019 ఫైనల్లో మలింగ వేసిన ఆఖరి ఓవర్ అభిమానులకు ఇప్పటికే గుర్తుండే ఉంటుంది. లీగ్​లో అదే ఇతడికి ఆఖరి మ్యాచ్. గతేడాది వ్యక్తిగత కారణాల వల్ల సీజన్​కు దూరమైన మలింగ.. ఈ ఏడాది వేలానికి ముందు రిటైర్మెంట్ ప్రకటించాడు.

అమిత్ మిశ్రా

అమిత్​ మిశ్రా

టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఐపీఎల్​లో 150 మ్యాచ్​ల్లో 160 వికెట్లు సాధించాడు. లీగ్​లో అత్యధిక వికెట్లు సాధించిన వారి జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం ఇతడు దిల్లీ క్యాపిటల్స్​కు ఆడుతున్నాడు. ఎకానమీ 7.34గా ఉంది.

పీయూష్ చావ్లా

పియూష్ చావ్లా

ఐపీఎల్ 2021 వేలంలో పీయూష్ చావ్లాను ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇప్పటివరకు 164 మ్యాచ్​లు ఆడిన ఇతడు 156 వికెట్లు సాధించాడు. ఎకానమీ 7.87గా ఉంది. లీగ్​లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్​కతా నైట్​రైడర్స్, పంజాబ్ కింగ్స్​కూ ప్రాతినిథ్యం వహించాడు పీయూష్.

డ్వేన్ బ్రావో

డ్వేన్​ బ్రావో

ఐపీఎల్​లో 140 మ్యాచ్​లాడిన బ్రావో 153 వికెట్లు సాధించి లీగ్​లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. అలాగే లీగ్​లో మలింగ తర్వాత అత్యధిక వికెట్లు సాధించిన రెండో పేసర్ ఇతడే. బ్రావో ఎకానమీ 8.40గా ఉంది. ధోనీ సారథ్యంలోని చెన్నైకి డెత్ ఓవర్లలో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడీ పేసర్.

హర్భజన్ సింగ్

హర్భజన్​ సింగ్​

ఐపీఎల్​లో 160 మ్యాచ్​లాడిన హర్భజన్ సింగ్ 150 వికెట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. లీగ్​లో ఇతడి ఎకానమీ 7.05గా ఉంది. గతేడాది వ్యక్తిగత కారణాల వల్ల లీగ్​కు దూరమైన భజ్జీని చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది వేలానికి ముందు విడుదల చేసింది. దీంతో ఇతడిని కోల్​కతా నైట్​రైడర్స్ కొనుగోలు చేసింది.​

ఆ తర్వాత ఈ జాబితాలో వరుసగా రవిచంద్రన్ అశ్విన్ (138), భువనేశ్వర్ కుమార్ (136), సునీల్ నరైన్ (127), చాహల్ (121), ఉమేశ్ యాదవ్ (119) టాప్​-10లో నిలిచారు.

ఇదీ చూడండి: ఐపీఎల్​ 2021: బరిలో దిగితే రికార్డులే!

ఐపీఎల్​: అత్యధిక సిక్సులు, ఫోర్లు వీరివే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.