ETV Bharat / sports

IPL 2021: ఆటగాళ్ల కోసం ప్రత్యేక విమానాలు.. సీఎస్​కే తప్ప!

మాంచెస్టర్​ టెస్టు(Manchester Test) రద్దు కారణంగా తమ ఆటగాళ్లను యూఏఈ రప్పించేందుకు ఐపీఎల్​ ఫ్రాంచైజీలు(IPL Franchises) సిద్ధమయ్యాయి. తమ ఆటగాళ్ల కోసం కొన్ని జట్లు యాజమాన్యాలు ప్రత్యేక విమానాలు సిద్ధం చేస్తుండగా.. సీఎస్​కే మాత్రం తమ ఆటగాళ్ల కోసం సాధారణ విమాన టికెట్లు బుక్​ చేస్తుంది.

IPL 2021: Franchises in talks with charter companies to fly players from UK to UAE
IPL 2021: ఆటగాళ్ల కోసం ప్రత్యేక విమానాలు.. సీఎస్​కే తప్ప!
author img

By

Published : Sep 10, 2021, 9:17 PM IST

ఇంగ్లాండ్​తో జరగాల్సిన ఐదో టెస్టు(IND Vs ENG 5th Test) రద్దు అయిన కారణంగా తమ ఆటగాళ్లను యూఏఈ రప్పించేందుకు ఐపీఎల్​ ఫ్రాంచైజీలు(IPL Franchises) కసరత్తులు చేస్తున్నాయి. ఆటగాళ్ల కోసం మాంచెస్టర్​ నుంచి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయనున్నారని సమాచారం. ఇందుకోసం ఛార్టెర్​ సంస్థలతో ఐపీఎల్​ జట్టు యాజమాన్యాలు సంప్రదింపులు జరిపాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రికి ఆటగాళ్లందరూ యూఏఈ చేరుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

భారత క్రికెటర్లతో ఇంగ్లాండ్​ ఆటగాళ్లను యూఏఈ రప్పించేందుకు ఇప్పటికే కసరత్తులు మొదలయ్యాయని ఓ ఫ్రాంఛైజీకి చెందిన అధికారులు వెల్లడించారు. బీసీసీఐ నుంచి ఒకసారి అనుమతి వచ్చిన వెంటనే క్రికెటర్ల కోసం చార్టెర్​ విమానాలు సిద్ధంగా ఉంచుతామని తెలిపారు. శనివారం సాయంత్రం లేదా ఆదివారం ఉదయాన్నే కుటుంబాలతో పాటు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు.

సాధారణ విమానాల్లో..

భారత్​, ఇంగ్లాండ్​ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు రద్దైన కారణంగా తమ క్రికెటర్లను యూఏఈ రప్పించేందుకు చెన్నై సూపర్​కింగ్స్​ జట్టు(Chennai Super Kings IPL) యాజమాన్యం కసరత్తులు చేస్తుంది. అయితే తమ ఆటగాళ్ల కోసం ప్రత్యేక విమానాలను కాకుండా సాధారణ విమానాల్లో టికెట్లు బుక్​ చేశారు. యూఏఈ చేరుకున్న తర్వాత వీరంతా ఆరు రోజులు క్వారంటైన్​ ఉండాల్సిఉందని సీఎస్​కే యాజమాన్యం తెలిపింది.

సీఎస్​కేకు చెందిన రవీంద్ర జడేజా, ఛెతేశ్వర్​ పుజారా, శార్దూల్​ ఠాకూర్​, మొయిన్​ అలీ, సామ్​ కరన్​లు ప్రస్తుతం మాంచెస్టర్​లో ఉన్నారు. అయితే వీరంతా.. ఇప్పటికే ఐపీఎల్​ కోసం ప్రాక్టీస్​ మొదలుపెట్టేశారు.

ఇదీ చూడండి.. IND Vs ENG 5th Test: 'మ్యాచ్​ రద్దుకు కరోనా కారణం కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.