ETV Bharat / sports

IPL 2021: ఐపీఎల్​లో ప్రేక్షకులు.. కానీ వారికి నో ఎంట్రీ! - ఐపీఎల్ 2021 షెడ్యూల్

ఐపీఎల్​ రెండో దశ(IPL 2021) జరగనున్న నేపథ్యంలో మ్యాచ్​లను చూసేందుకు స్టేడియానికి వచ్చే అభిమానులు తప్పనిసరిగా కొవిడ్​ నిబంధనలు పాటించాల్సిందేనని నిర్వాహకులు స్పష్టం చేశారు. రెండు డోసుల కొవిడ్​ వ్యాక్సినేషన్​(2 Doses of Covid Vaccine) తీసుకున్న వారికే అనుమతించడం సహా 16 ఏళ్ల లోపు వారికి ఎంట్రీ ఉండదని చెబుతున్నారు. అయితే ఈ మ్యాచ్​లను నిర్వహించనున్న మూడు వేదికల్లో విధించిన రూల్స్(Covid-19 Rules in UAE) ఏమిటో తెలుసుకుందాం.

IPL 2021: Fans below 16 not allowed entry at Sharjah stadium, PCR COVID-19 report not needed in Dubai
IPL 2021: ఐపీఎల్​లో చూసేందుకు వారికి ఎంట్రీ లేదు!
author img

By

Published : Sep 19, 2021, 11:02 AM IST

Updated : Sep 19, 2021, 11:43 AM IST

ఐపీఎల్​-2021(IPL 2021) రెండోదశకు ప్రేక్షకులను అనుమతించాలని భారత క్రికెట్​ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇటీవలే నిర్ణయం తీసుకుంది. స్టేడియాల్లో 50 శాతం సామర్థ్యంతో అభిమానులకు టికెట్లు జారీ చేయడమే కాకుండా.. యూఏఈ కొవిడ్​ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఫ్యాన్స్​కు సూచించింది. అయితే కరోనా వ్యాప్తి కారణంగా మ్యాచ్​లకు వేదికలైన(IPL 2021 Stadium List) దుబాయ్​, అబుదాబి, షార్జాల్లో పలు నిబంధనలు​(Covid-19 Rules in UAE) పెట్టింది.

మ్యాచ్​లు చూసేందుకు స్టేడియాల్లోకి వచ్చే అభిమానులు 48 గంటల ముందు ఆర్​టీ-పీసీఆర్​ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదని నిర్వాహకులు తెలిపారు. కానీ, రెండు డోసులు తీసుకున్నట్లు వ్యాక్సిన్​(2 Doses of Covid Vaccine) ధ్రువీకరణ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. స్టేడియాల్లో సీటు సీటుకు మధ్య భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలి. అయితే 12 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసున్న వారికి ఈ నిబంధన వర్తించదు. టికెట్లను(IPL 2021 Tickets) మొబైల్​లో డౌన్​లోడ్​ చేసుకోవడం ద్వారా.. స్టేడియాల బయట స్కానింగ్​ చేస్తే సరిపోతుంది.

షార్జాలో అలా..

అయితే షార్జాలో మాత్రం కొన్ని నిబంధనలు(Covid-19 Rules Sharjah) వేరుగా ఉన్నాయి. షార్జా స్టేడియంలో మ్యాచ్​ చూడాలంటే కచ్చితంగా 16 ఏళ్లు దాటిన వారినే అనుమతించనున్నారు. దీంతో పాటు రెండు డోసుల వ్యాక్సినేషన్​ పత్రాలు కావాల్సి ఉంది. 48 గంటల్లోపు ఆర్​టీ-పీసీఆర్​ కొవిడ్​ రిపోర్ట్​ ప్రేక్షకులు తమతో తీసుకురావాల్సిఉంది. దానితో పాటు మొబైల్స్​లో అల్​ హోస్న్​ యాప్​ను కచ్చితంగా డౌన్​లోడ్​ చేసుకోవాలి.

అబుదాబి స్టేడియంలో ఇలా..

అబుదాబి స్టేడియానికి(Covid-19 Rules Abu Dhabi) వచ్చే ప్రేక్షకులకు కచ్చితంగా రెండు డోసుల కొవిడ్​ వ్యాక్సిన్​ను తీసుకుంటేనే అనుమతి. 48 గంటల్లోపు ఆర్​టీ-పీసీఆర్​ కొవిడ్​ రిజల్ట్​ రావాల్సింది. 12-15 ఏళ్ల వయసున్న వారు వ్యాక్సినేషన్​ పత్రాలు లేకపోయినా.. కొవిడ్​ రిపోర్ట్​ తప్పనిసరి.

కానీ, ఐపీఎల్​ నిర్వహించనున్న ఈ మూడు వేదికల్లో మాస్క్​ ధరించడం.. భౌతికదూరాన్ని పాటించడం వంటి వాటిని ఫ్యాన్స్​ తప్పనిసరిగా పాటించాలి. స్టేడియం గేట్ల వద్ద శరీర ఉష్ణోగ్రతను కొలిచే పరికరాలుంటాయి. ఒక్కసారి స్టేడియం నుంచి బయటకు వస్తే.. మళ్లీ లోపలికి వెళ్లేందుకు వీలుండదు.

ఇండియన్ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్​-2021) రెండో దశ ఆదివారం(సెప్టెంబరు 19) నుంచి పునఃప్రారంభం కానుంది. దుబాయ్​ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​, చెన్నై సూపర్​కింగ్స్​(CSK Vs MI 2021) జట్లు తలపడనున్నాయి.

ఇదీ చూడండి.. IPL 2021 News: 'ఐపీఎల్​ ట్రోఫీ గెలవడమే మా లక్ష్యం'

Last Updated : Sep 19, 2021, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.