అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్లో టాస్ గెలిచిన దిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
ఈ మ్యాచ్ కోసం బెంగళూరు రెండు మార్పులు చేసింది. సైనీ, క్రిస్టియన్లకు బదులుగా.. పాటిదార్, సామ్స్ను జట్టులోకి తీసుకుంది. దిల్లీ ఒక్క మార్పు చేసింది. అశ్విన్ స్థానంలో ఇషాంత్ శర్మకు తుది జట్టులోకి చోటు కల్పించింది.
జట్లు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), పడిక్కల్, మ్యాక్స్వెల్, డివిలియర్స్, వాషింగ్టన్ సుందర్, కైల్ జేమిసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, పాటిదార్, చాహల్, సామ్స్.
దిల్లీ క్యాపిటల్స్
పృథ్వీ షా, ధావన్, స్టీవ్ స్మిత్, పంత్ (కెప్టెన్), స్టోయినిస్, హెట్మెయర్, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, రబాడ, అమిత్ మిశ్రా, అవేశ్ ఖాన్.