ETV Bharat / sports

సూపర్​ ఓవర్లో దిల్లీ థ్రిల్లింగ్​ విన్ - దిల్లీ క్యాపిటల్స్ vs సన్​రైజర్స్​ హైదరాబాద్ మ్యాచ్ ఫలితం

చెపాక్ వేదికగా జరిగిన దిల్లీ- హైదరాబాద్ మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది. ఈ ఉత్కంఠ భరిత పోరులో పంత్ సేన ఘన విజయం సాధించింది.

delhi capitals vs sunrisers hyderabad, delhi won the match against hyderabad
దిల్లీ క్యాపిటల్స్​ vs సన్​రైజర్స్​ హైదరాబాద్, దిల్లీ హ్యాట్రిక్​ విజయం
author img

By

Published : Apr 25, 2021, 11:52 PM IST

Updated : Apr 26, 2021, 12:05 AM IST

సూపర్‌ఓవర్‌కు దారితీసిన మ్యాచ్‌లో హైదరాబాద్‌పై దిల్లీ విజయం సాధించింది. ఈ సూపర్‌ ఓవర్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 7 పరుగులే చేయగా అనంతరం దిల్లీ ఆ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సీజన్‌లో ఇదే తొలి సూపర్‌ ఓవర్‌ కావడం విశేషం. అంతకుముందు దిల్లీ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దాంతో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి.

ఛేదనలో బెయిర్‌స్టో(38: 18 బంతుల్లో 3X4, 4X6) విలియమ్సన్‌(66 నాటౌట్‌: 51 బంతుల్లో 8X4) రాణించారు. చివరి ఓవర్‌లో 16 పరుగులు అవసరమైన వేళ సన్‌రైజర్స్‌ 15 పరుగులే చేసింది. ఆఖర్లో జగదీశ సుచిత్‌(14నాటౌట్‌; 6 బంతుల్లో 2x4, 1x6) రాణించాడు. ఇక దిల్లీ బౌలర్లలో అవేశ్‌ ఖాన్‌ 3, అక్షర్‌పటేల్‌ 2, అమిత్‌ మిశ్రా ఒక వికెట్‌ తీశారు.

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీషా(53; 39 బంతుల్లో 7x4, 1x6), శిఖర్‌ ధావన్‌(28; 26బంతుల్లో 3x4) శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 81 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని రషీద్‌ఖాన్‌ విడదీశాడు. 11వ ఓవర్‌లో ధావన్‌ను బౌల్డ్‌ చేసి సన్‌రైజర్స్‌కు ఊరటనిచ్చాడు. తర్వాతి ఓవర్‌లోనే అర్ధశతకంతో దూసుకుపోతున్న పృథ్వీ రనౌటయ్యాడు. దాంతో దిల్లీ 84 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ఆపై జోడీ కట్టిన రిషభ్‌ పంత్‌(37; 27 బంతుల్లో 4x4, 1x6), స్మిత్‌(34; 25 బంతుల్లో 3x4, 1x6) రాణించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 58 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.

అయితే, సిద్ధ్‌ర్థ్‌కౌల్‌ వేసిన 19వ ఓవర్‌లో పంత్‌, హెట్మేయర్‌(2) పెవిలియన్‌ చేరారు. ఆఖరి ఓవర్‌లో స్మిత్‌ ధాటిగా ఆడి 14 పరుగులు రాబట్టాడు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో సిద్ధార్థ్‌ రెండు, రషీద్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.

Last Updated : Apr 26, 2021, 12:05 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.